హోమ్ /వార్తలు /క్రీడలు /

Australia : గృహహింస కేసులో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అరెస్ట్.. గతంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు..

Australia : గృహహింస కేసులో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అరెస్ట్.. గతంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు..

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా

Australia : సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్‌ వేల్స్‌ పోలీసులు వెల్లడించారు.

గృహహింస ఆరోపణల కేసులో ఆస్ట్రేలియా (Australia) మాజీ క్రికెటర్ కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ (Micheal slater) అరెస్టైనట్లు సమాచారం. సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్‌ వేల్స్‌ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు... " అక్టోబరు 12న... గృహహింస ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈస్టర్న్‌ సబర్బ్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా బుధవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు అతడిని అరెస్టు చేశాం " అని ప్రకటన విడుదల చేశారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలాఉండగా.. స్లేటర్ పై గృహహింస ఆరోపణలు చేసింది ఎవరు..? ఎందుకు చేశారు..? అనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మైకేల్ స్లేటర్

స్లేటర్ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే కొత్త కాదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ (IPL 2021) సీజన్ సందర్భంగా కూడా అతడు.. ఆస్ట్రేలియా ప్రధాని (Australia prime minister) స్కాట్ మోరిసన్ (Scott morrison) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశంలో క్వారంటైన్ నిబంధనల గురించి స్లేటర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి : మెగా టోర్నీలో టీమిండియా మహాసేన ఇదే..! టీమిండియాకు వీళ్లే కీలకం..!

" మా ప్రభుత్వం ఆసీస్ ఆటగాళ్లపై భద్రత వహిస్తే వాళ్లు మమ్మల్ని ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ ఇది అవమానకరం. డీయర్ పీఎం.. మాతో ఇలా వ్యవహరించడానికి మీకెంత ధైర్యం. మీరు క్వారంటైన్ వ్యవస్థను ఎలా క్రమబద్దీకరిస్తారు..? మీ చేతులు రక్తంతో తడిచిపోయాయ్ " అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి : ఓ వైపు దేశంలో కల్లోలం.. మరోవైపు కప్ కోసం పోరాటం..! అఫ్గాన్ బలబలాలు ఇవే..!

దీంతో గత కొద్దికాలంగా స్లేటర్ పనిచేస్తున్న ఛానల్ 7 యాజమాన్యం అతడిని కామెంటేటర్ ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మైకేల్‌ స్లేటర్.. టెస్టు బ్యాటింగ్‌ టాపార్డర్‌లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్‌లో మొత్తంగా 5312 పరుగులు చేసిన స్లాటర్‌.. 2004లో ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రాడ్‌కాస్టర్‌గా, టెలివిజన్‌ పండిట్‌గా గుర్తింపు సంపాదించాడు.

First published:

Tags: Australia, Cricket, Sports

ఉత్తమ కథలు