AUSTRALIA EX CAPTAIN TIM PAINE LEAVES ALL FORMS OF CRICKET IN COMING DAYS SAYS CRICKET TASMANIA JNK
Tim Paine: క్రికెట్‌కు టిమ్ పైన్ గుడ్ బై? అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్న ఆసీస్ మాజీ కెప్టెన్.. సెక్స్ స్కాండలే కారణమా?
క్రికెట్‌కు టిమ్ పైన్ గుడ్ బై.. ప్రస్తుతం అందుబాటులో ఉండనని చెప్పిన పైన్ )PC: Twitter)
Tim Paine: సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కొని కెప్టెన్సీకి రాజీనామా చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ టిమ్ పైన్.. త్వరలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ టాస్మానియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు (Australia Team) కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) ఇటీవల అభ్యంతరకర మెసేజీల స్కాంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. క్రికెట్ టాస్మానియాకు (Cricket Tasmania) చెందిన సహచర ఉద్యోగినితో 'సెక్స్టింగ్' చేసిన విషయం బయటకు వచ్చింది. అతను కెప్టెన్ కాక ముందు 2017లో జరిగిన ఈ ఉదంతంపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) కూడా నిజమేనని తేల్చింది. ఆ తర్వాత ఆ పర్సనల్ చాటింగ్ బయటకు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన టిమ్ పైన్ మీడియా ముందుకు వచ్చాడు. కీలకమైన యాషెస్ సిరిస్ (The Ashes) ముందు తాను టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నానని.. గతంలో జరిగిన ఘటన పట్ల చాలా పశ్చత్తాపం చెందుతున్నట్లు పేర్కొన్నాడు. దీంతో టిమ్ పైన్‌పై ఒక్కసారిగా విమర్శలు తలెత్తాయి. అసలు అలాంటి నీచమైన పనికి పాల్పడి ఆస్ట్రేలియా కెప్టెన్ పదవిని ఎలా స్వీకరించారని పలువురు వ్యాఖ్యానించారు. కెప్టెన్‌గానే కాదు.. అతడిని ఆటగాడిగా కూడా జట్టులో కొనసాగించవద్దని డిమాండ్లు వచ్చాయి. త్వరలో యాషెస్ ప్రారంభం కానున్నది. అయితే తుది జట్టులో టిమ్ పైన్ ఉంటాడా లేదా అనేది ఇంకా సందిగ్దంగానే ఉన్నది.
టిమ్ పైన్ త్వరలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ టాస్మానియా శుక్రవారం ప్రకటించింది. టిమ్ పైన్ సెక్స్టింగ్ వ్యవహారం ఆస్ట్రేలియాలో తీవ్ర దుమారం రేపడంతో అతడు రాజీనామా చేశాడు. అదే సమయంలో అతడు యాషెస్ ఆడే విషయంలో కూడా సానుకూలత వ్యక్తం కావడం లేదు. డిసెంబర్ 8 నుంచి యాషెస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్చ మరింత తీవ్ర రూపం దాల్చింది. గత 24 గంటలుగా చర్చించిన అనంతరం టిమ్ పైన్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికేందుకు సిద్దపడ్డాడని క్రికెట్ టాస్మానియా ఆ ప్రకటనలో పేర్కొన్నది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పడమే కాకుండా.. అసలు క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలకు కూడా దూరంగా ఉండేందకు టిమ్ పైన్ సిద్దపడ్డట్లు తెలుస్తున్నది. మానసిక ఆరోగ్యం సరిగా లేనందు వల్ల అతను క్రికెట్‌కు అందుబాటులో ఉండడని సమాచారం.
ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టాస్మానియా తరపున ఆడే టిమ్ పైన్ రెండు వారాల కిందట జాతీయ కెప్టెన్‌గా రాజీనామా చేసే సమయంలో జట్టులో కొనసాగుతానని చెప్పాడు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఈ విషయంలో పైన్‌కు అండగానే నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ కూడా టిమ్ పైన్ జట్టులో కొనసాగడానికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని చెప్పాడు. అతడు తొలి టెస్టు ఆడతాడనే అందరూ అనుకున్నట్లు భావించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ కూడా లేకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఆ పనిలో నిమగ్నమైంది.
ఐదుగురు సభ్యులు గల ప్యానెల్ పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్‌లను కెప్టెన్ పదవి కోసం ఇంటర్య్వూ చేసింది. సెలెక్టర్లు జార్జ్ బెయిలీ, టోనీ డోడెమెయిడ్, సీఏ బోర్డు సభ్యులు మెల్ జోన్స్, సీఈవో నిక్ హోక్లే, చైర్మెన్ రిచర్డ్ ఈ ఇంటర్యూలు నిర్వహించింది. త్వరలోనే కొత్త కెప్టెన్‌కు సంబంధించిన వార్తను ప్రకటించే అవకాశం ఉన్నది.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.