రక్తం కారుతున్నా బ్యాటింగ్ చేసింది అతని కోసమే... - ఆసీస్ క్రికెటర్ షేన్ వాట్సన్...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కాలికి గాయమై, రక్తం కారుతూ ప్యాంటు తడిసిపోయినా అలాగే బ్యాటింగ్ కొనసాగించిన షేన్ వాట్సన్... కేవలం ధోనీ కోసమే బ్యాటింగ్ కొనసాగించానంటూ వివరణ ఇచ్చిన ఆసీస్ క్రికెటర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 18, 2019, 6:46 PM IST
రక్తం కారుతున్నా బ్యాటింగ్ చేసింది అతని కోసమే... - ఆసీస్ క్రికెటర్ షేన్ వాట్సన్...
1. షేన్ వాట్సన్: ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగోచ్చు. గత సీజన్లో, వాట్సన్ కేవలం 23.41 సగటుతో 398 పరుగులు మాత్రం చేశాడు. 2018లో చెన్నై ఐపీఎల్ ఛాంపియన్‌గా కీలక పాత్ర పోషించాడు. 154.59 స్ట్రైక్ రేట్‌లో ఐపీఎల్ 11 లో వాట్సన్ 555 పరుగులు చేశాడు.
  • Share this:
ఐపీఎల్ 12వ సీజన్‌లో చాలా మ్యాచులు చివరి బంతి దాకా ఉత్కంఠ భరితంగా సాగాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఫైనల్ ఫైట్ అయితే క్రికెట్ ఫ్యాన్స్‌ మదిలో ఎప్పటికీ గుర్తిండిపోతోంది. చివరి బంతి వరకూ ఇరు జట్లనూ దోబూచులాడిన విజయం... ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్‌కు దక్కిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో చెన్నైై సూపర్ కింగ్స్ తరుపున బరిలో దిగిన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్... 59 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసి... కీలక సమయంలో రనౌట్ అయ్యాడు. అయితే కాలికి గాయమై, రక్తం కారుతూ ప్యాంటు తడిసిపోయినా షేన్ వాట్సన్ అలాగే బ్యాటింగ్ చేశాడని... చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా చెప్పేదాకా ఆ విషయం ఎవ్వరూ గుర్తించలేకపోయారు. బజ్జీ ట్వీట్ తర్వాత షేన్ వాట్సన్ డెడికేషన్ లెవెల్స్‌కు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే క్రికెట్ వరల్డ్‌కప్ ముందున్న తరుణంలో షేన్ వాట్సన్ ఇంత రిస్క్ చేసి బ్యాటింగ్ చేయడం అంత అవసరమా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్ మనోడు చేసిన పనిని తట్టుకోలేకపోతున్నారు. కొంచెం తేడా కొడితే... గాయం కారణంగా షేన్ వాట్సన్, వరల్డ్‌కప్‌ జట్టులో చోటు మిస్ చేసుకునేవాడని చివాట్లు పెడుతున్నారు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత వరల్డ్‌కప్ ప్రాక్టీస్ కోసం ఆసీస్ చేరిన షేన్ వాట్సన్‌కు అక్కడి మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.

రక్తం కారుతున్నా బ్యాటింగ్ ఎందుకు కొనసాగించారంటూ మీడియా నుంచి షేన్ వాట్సన్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి వాట్సన్ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ‘రక్తం కారుతున్నా బ్యాటింగ్ చేయడానికి ఒకే ఒక్క కారణం ధోనీ. అవును... నేను ఫామ్‌లో లేనప్పుడు కూడా నా మీద నమ్మకంతో నాకు వరుసగా జట్టులో అవకాశం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని కోసం ఏదైనా చేయాలని అనుకున్నా. ఇంతకంటే ఏం చేయగలను. ఇంకా ధోనీ ఫ్యాన్స్ మాపైన చూపించిన అంతులేని ప్రేమ. గాయం కారణంగా డెడికేషన్ లేకుండా వెళ్లి పెవిలియన్‌లో కూర్చుంటే... అది ఫ్యాన్స్‌ను అవమానించినట్టే!’ అంటూ వివరణ ఇచ్చాడు షేన్ వాట్సన్. షేన్ వాట్సన్ వివరణతో మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు. క్రికెట్‌ను, ఫ్యాన్స్‌ను ఇంతగా అభిమానించే అంకితభావం ఉన్న క్రికెటర్లు మన దేశంలో కూడా రావాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
Published by: Ramu Chinthakindhi
First published: May 18, 2019, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading