IND vs AUS 1st ODI: రోహిత్ సెంచరీ వృథా..తొలి వన్డేలో టీమిండియా ఓటమి...

టెస్ట్ సిరీస్‌లో హిస్టారిక్ విక్టరీ సాధించిన విరాట్ సేన వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేయలేకపోయింది. 289 పరుగుల చేధించదగ్గ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 254 పరుగులు మాత్రమే చేయగలిగింది.

news18-telugu
Updated: January 12, 2019, 7:11 PM IST
IND vs AUS 1st ODI: రోహిత్ సెంచరీ వృథా..తొలి వన్డేలో టీమిండియా ఓటమి...
సిడ్నీ వన్డేలో 34 పరుగులతో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం ( BCCI/ICC/ Twitter )
news18-telugu
Updated: January 12, 2019, 7:11 PM IST
సిడ్నీ వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు. టెస్ట్ సిరీస్‌లో హిస్టారిక్ విక్టరీ సాధించిన విరాట్ సేన వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేయలేకపోయింది.‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినా...ధోనీ మినహా మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవ్వడంతో 289 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా విఫలమైంది. 34 పరుగుల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఇది 1000వ విజయం కావడం విశేషం. 289 పరుగుల చేధించదగ్గ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 254 పరుగులు మాత్రమే చేయగలిగింది.





ఓ దశలో 4 పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ రోహిత్ శర్మ, ధోనీ ఆదుకున్నారు. సెంచరీ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. విరాట్ కొహ్లీ విఫలమవ్వడంతో పాటు రాయుడు, ధావన్ డకౌటవ్వడంతో చేజింగ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్‌ తనదైన శైలిలోనే దూకుడుగా ఆడగా...ధోనీ డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ధోనీతో కలిసి 136 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం జోడించి భారత్‌ను పోటీలో నిలిపాడు రోహిత్. 93 బంతుల్లో 68వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధోనీ ఔటయ్యాడు. ధోనీ-రోహిత్ నాలుగో వికెట్‌కు 171 బంతుల్లో 137 పరుగులు జోడించారు.

దినేష్ కార్తీక్, జడేజా సైతం విఫలమైనా...రోహిత్ ఒంటరి పోరాటం చేశాడు. వన్డేల్లో 22వ సెంచరీ నమోదు చేసి జట్టును పోటీలో నిలిపాడు. 129 బంతుల్లో 10 ఫోర్లు,6 సిక్సర్లు 133 పరుగులు చేసిన రోహిత్ వెనుదిరగడంతో ఆస్ట్రేలియా జట్టు విజయం ఖాయమైంది. 50 ఓవర్లలో భారత్‌ను 254 పరుగులకే కట్టడి చేసి ఆసీస్ టీమ్ వన్డే సిరీస్‌లో తొలి విజయం సాధించింది. 10 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.
Loading...
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. పీటర్ హ్యాండ్స్‌కూంబ్(73), షాన్ మార్ష్(54), ఉస్మాన్ ఖవాజా(59) హాఫ్ సెంచరీలతో పాటు మార్కస్ స్టోయినిస్(47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 288 పరుగులు చేసింది.
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...