హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Aus: వాంఖడేలో టీమిండియా బౌలర్లు అదుర్స్‌! సిరాజ్‌ దెబ్బకు ఆసీస్‌ డమాల్‌

Ind Vs Aus: వాంఖడేలో టీమిండియా బౌలర్లు అదుర్స్‌! సిరాజ్‌ దెబ్బకు ఆసీస్‌ డమాల్‌

వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్ (Photo BCCI)

వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్ (Photo BCCI)

పేసర్లు షమీ, హైదరాబాద్‌ స్పీడ్‌స్టార్‌ సిరాజ్‌ పదునైన బంతులతో ఆసీస్‌ను కట్టడిచేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ భయపెట్టారు. ముఖ్యంగా పేసర్లు షమీ, హైదరాబాద్‌ స్పీడ్‌స్టార్‌ సిరాజ్‌ పదునైన బంతులతో ఆసీస్‌ను కట్టడిచేశారు. సిరాజ్‌, షమీ రాణించడంతో ఆసీస్‌ 35.4ఓవర్లలో కేవలం 188పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌, షమీ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్‌ మార్స్‌ 81పరుగులతో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

మిచెల్ మార్ష్ మినహా:

టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి హెడ్ క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత స్మిత్, మిచెల్ మార్ష్ మరో వికెట్ పడకుండా ఇన్సింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌‌కు 72 పరుగులు చేశారు. తర్వాత హార్దిక్ బౌలింగ్‌లో స్మిత్ కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‎కు చేరాడు. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో స్టీవ్ స్మిత్‌(30 బంతుల్లో 4 ఫోర్లతో 22)ను పెవిలియన్ చేర్చాడు. వికెట్ల వెనుకాల ఫుల్ లెంగ్త్ డైవ్‌తో రాహుల్ అందుకున్న ఈ క్యాచ్ అభిమానుల కట్టిపడేసింది. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌కు స్టీవ్ స్మిత్ సైతం బిత్తరపోయాడు. స్మిత ఔటయ్యినా మిచెల్ దూకుడు కొనసాగించాడు. మూడో వికెట్‌కు 52 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు విజృంభించి క్రమంగా వికెట్లు తీశారు.

గేర్‌ మార్చిన బౌలర్లు:

నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లను స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చారు టీమిండియా బౌలర్లు. ఓ దశలో భారీ స్కోర్‌ ఖాయమనుకున్న మ్యాచ్‌ను మొత్తం ఇండియావైపు తిప్పేశారు. దూకుడు ఆడుతూ సెంచరీ దిశగా సాగిన మిచెల్ మార్ష్ (65 బంతుల్లో 81)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. తర్వాత స్వల్ప వ్యవధిలోనే లబూషేన్ (22 బంతుల్లో 15) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లీష్‌ను షమీ బౌల్డ్ చేయడంతో కంగారులు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది . ఆసీస్‌ను కాపాడుతాడని భావించిన బ్యాటర్‌ స్టోయినిస్ 5 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో శుభమాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఏ దిశలోనూ రాణించలేకపోయింది సిరాజ్, షమీ తలో మూడు వికెట్లతో ఆసీస్‌ పతానాన్ని శాశించారు. అటు పాండ్యా,జడేజా,కుల్దీప్, కూడా వరుస విరామాల్లో వికెట్లు తియ్యడంతో ఆసీస్‌ ఎక్కువసేపు నిలవలేకపోయింది. 12ఏళ్లుగా వన్డేల్లో వాంఖడేలో గెలవని టీమిండియా ఈసారి గెలుస్తుందని ధీమాగా ఉన్నారు అభిమానులు.

First published:

Tags: India vs australia, Mohammed Siraj

ఉత్తమ కథలు