AUSSIE OPENER DAVID WARNER COMES AGAIN WITH ALL ARJUN PUSHPAS CRAZY DIALOGUE WATCH VIRAL VIDEO SRD
Viral Video : రాజ్.. పుష్ప రాజ్.. నీ అవ్వ వార్నర్ తగ్గేదే లే.. డేవిడ్ బాయ్ వీడియోకి అల్లు అర్జున్ క్రేజీ రిప్లై..
David Warner (PC : Instagram)
Viral Video : సన్ రైజర్స్ జట్టులో ఉన్నప్పుడు తెలుగు హీరోల డైలాగులు, సాంగ్స్ తో రెచ్చిపోయిన డేవిడ్ బాయ్.. ఇప్పుడు ఆ జట్టును వీడినా మన స్టార్లను మాత్రం వదలడం లేదు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్ తో రచ్చ చేశాడు.
ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను అలరించిన వార్నర్... తాజాగా రూట్ మార్చాడు. అతనిప్పుడు మార్ఫ్డ్ ఫేస్ యాప్ తో ఫేమస్ తెలుగు, హిందీ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ల లో హీరోల ముఖాన్ని తీసేసి.. అందులో తన ముఖాన్ని అతికించి.. డైలాగులు ఇరగదీస్తున్నాడు. సన్ రైజర్స్ జట్టులో (SunRisers Hyderabad) ఉన్నప్పుడు తెలుగు హీరోల డైలాగులు, సాంగ్స్ తో రెచ్చిపోయిన డేవిడ్ బాయ్.. ఇప్పుడు ఆ జట్టును వీడినా మన స్టార్లను మాత్రం వదలడం లేదు. లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మూవీ 'పుష్ప'ను కూడా ఈ ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ విడిచిపెట్టలేదు. ఓ వైపు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉంటూనే.. తెలుగు సినిమా అప్డేట్స్ను ఫాలో అవుతున్నాడు.
ఇటీవల తెలుగునాట పుష్ప చిత్రంలోని పుష్పరాజ్ చెప్పిన ఓ డైలాగ్ బాగా పాపులర్ అయింది. దీంతో అదే డైలాగ్‌తో వార్నర్ బాబాయి ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. పుష్ప చిత్రంలోని పుష్ప.. పుష్ప రాజ్, నీ అవ్వ తగ్గెదేలే అనే డైలాగ్ చెప్పి వార్నర్ అదరగొట్టాడు.వెనుక వాయిస్ వస్తుంటే వార్నర్ దానికి తగ్గట్టుగా తనదైన రీతిలో హవభావాలు కనబరిచాడు. దానికి తగ్గట్టుగా లిప్స్ కదిలించి వారెవ్వా.. వార్నర్ బాబాయి అనిపించాడు. ఈ వీడియోను వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
దీంతో ఇంకేముందు ఆ వీడియోను చూసి ఫ్యాన్స్ ఊరుకుంటారా? లైక్‌లు కొట్టి, కామెంట్స్ చేసి షేర్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇలా చాలా కాలం తర్వాత వార్నర్ మళ్లీ కనిపించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, ఈ వీడియోకు అల్లు అర్జున్ కూడా క్రేజీ రిప్లై ఇచ్చాడు. నీ యవ్వ తగ్గేదే లే అంటూ కామెంట్ చేశాడు.
అయితే, అచ్చం ఇదే డైలాగ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్, రష్మిక మందాన హిరో, హిరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
డేవిడ్ వార్నర్ 2020 లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. లాక్ డౌన్ ను మనోడు మాములుగా ఉపయోగించుకోలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.