హోమ్ /వార్తలు /క్రీడలు /

AUS W vs SA W Final : ఆఖరి సమరంలో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. తుది జట్లు ఇవే

AUS W vs SA W Final : ఆఖరి సమరంలో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. తుది జట్లు ఇవే

PC : ICC

PC : ICC

AUS W vs SA W Final :  దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023) ఆఖరి సమరానికి చేరుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

AUS W vs SA W Final :  దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023) ఆఖరి సమరానికి చేరుకుంది. కేప్ టౌన్ వేదికగా మరికాసేపట్లో ఫైనల్ పోరు జరగనుంది. టైటిల్ పోరులో 5 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)తో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ ల్యానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎటువంటి మార్పులు లేకుండానే ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. సౌతాఫ్రికా కూడా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది.

ఇప్పటి వరకు మహిళల టి20 ప్రపంచకప్ 7 సార్లు జరిగితే అందులో 5 సార్లు ఆస్ట్రేలియా చాంపియన్ గా నిలిచింది. ఇంగ్లండ్, విండీస్ జట్లు ఒక్కోసారి టైటిల్స్ ను నెగ్గాయి. దీనిని బట్టి టి20 ఫార్మాట్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలీసా హీలీ, బెత్ మూనీ, పెర్రీ, గార్డ్ నర్, మెగ్ ల్యానింగ్, తాలియా మెక్ గ్రాత్ లతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ లో మేగాన్ షూట్, బ్రౌన్, జొనాసెన్ లతో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ ఫైనల్లో కూడా నెగ్గి 6వ సారి ప్రపంచ చాంపియన్స్ అనిపించుకోవాలనే పట్టుదల మీద ఆసీస్ ఉంది.

లీగ్ దశలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా అనూహ్యంగా ఓడింది. అనంతరం ఆసీస్ చేతిలో ఓడింది. ఈ దశలో సౌతాఫ్రికా ఫైనల్ వరకు చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లపై నెగ్గిన సఫారీ జట్టు నెట్ రన్ రేట్ ద్వారా సెమీస్ కు చేరుకుంది. ఇక సెమీస్ లో లారా, బ్రిట్స్, క్యాప్ వీరోచిత బ్యాటింగ్ కు ఇస్మాయిల్, అయబొంగ ఖాఖా బౌలింగ్ ప్రదర్శన తోడవ్వడంతో ఇంగ్లండ్ పై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతుండటం సౌతాఫ్రికాకు కలిపి వచ్చే అంశం. అలాగే టి20 ఫార్మాట్ లో ఆసీస్ డామినేషన్ తో బోర్ కొట్టిన వాళ్లు సౌతాఫ్రికా గెలిస్తే చూడాలని కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా పురుషుల క్రికెట్ కానీ మహిళల క్రికెట్ కానీ ప్రపంచకప్ ను ఇప్పటి వరకు గెలవలేదు. ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిస్తే మాత్రం దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో సువర్ణ ఆధ్యాయంగా నిలిచిపోతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకావం ఉంది. ఒకవేళ చేయాల్సి వస్తే జార్జియా స్థానంలో అలానా కింగ్ ను ఆసీస్ తుది జట్టులోకి తీసుకోవచ్చు.

ముఖాముఖి

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 5 అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్ ల్లోనూ ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది.

తుది జట్లు (అంచనా)

ఆస్ట్రేలియా

అలీసా హేలీ, బెత్ మూనీ, మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), యాష్ గార్డ్ నర్, ఎలీసా పెర్రీ, తాలియా మెక్ గ్రాత్, గ్రేస్ హ్యారీస్, జార్జియా, జెస్ జొనాసెన్, మేగాన్ షూట్, బ్రౌన్

సౌతాఫ్రికా

సునె లూస్ (కెప్టెన్), లారా వొల్వార్డ్, బ్రిట్స్, క్యాప్, ట్రయాన్, బోష్, డె క్లెర్క్, సినాలో జఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగ ఖఖా, నాన్ కులెలోక్కో మ్లాబా

First published:

Tags: Australia, South Africa, Womens T20 World Cup

ఉత్తమ కథలు