AUS W vs SA W Final: మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023) రసవత్తరంగా సాగుతోంది. సౌతాఫ్రికా మహిళల జట్టు (South Africa Women's Team)తో జరుగుతున్న తుది పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల (Australia Women's Team) జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకుంది. భారత్ తో జరిగిన సెమీఫైనల్లో కూడా మూనీ అర్ధ సెంచరీతో కదం తొక్కింది. తాజాగా ఫైనల్లో కూడా అజేయ అర్థ సెంచరీతో ఆసీస్ ను ఆదుకుంది. యాష్ గార్డ్ నర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించింది. వీరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానె క్యాప్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ (18; 3 ఫోర్లు), బెత్ మూనీలు శుభారంభం చేశారు. వీరిద్దరు తొలి వికెట్ కు 36 పరుగులు జోడించారు. అనంతరం హీలీ అవుటైంది వన్ డౌన్ లో వచ్చిన యాష్ గార్డ్ నర్ తో కలిసి బెత్ మూనీ జట్టును ముందుకు నడిపింది. వీరిద్దు వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరిద్దరు రెండో వికెట్ కు 46 పరుగులు జోడించారు. కీలక సమయంలో గార్డ్ నర్ అవుటైంది. ఇక ఇక్కడి నుంచి జట్టు భారాన్ని బెత్ మూనీనే మోసింది. ఒక ఎండ్ లో మూనీ పరుగులు సాధిస్తుంటే మరో ఎండ్ లోని ప్లేయర్లు మాత్రం పెవిలియన్ కు క్యూ కట్టారు. భారత్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో ఏ విధంగా అయితే ఆడిందో అంతకు మించి బెత్ మూనీ ఇక్కడ పోరాటం చేసింది. ఆఖరి ఓవర్లో సిక్స్, ఫోర్ బాది జట్టు స్కోరును 150 మార్కును దాటించింది. అయితే చివరి ఓవర్లో రెండు వికెట్లు పడటంతో ఆస్ట్రేలియా అనుకున్న పరుగుల కంటే కూడా ఒక 15 పరుగులు తక్కువ చేసింది.
తుది జట్లు (అంచనా)
ఆస్ట్రేలియా
అలీసా హేలీ, బెత్ మూనీ, మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), యాష్ గార్డ్ నర్, ఎలీసా పెర్రీ, తాలియా మెక్ గ్రాత్, గ్రేస్ హ్యారీస్, జార్జియా, జెస్ జొనాసెన్, మేగాన్ షూట్, బ్రౌన్
సౌతాఫ్రికా
సునె లూస్ (కెప్టెన్), లారా వొల్వార్డ్, బ్రిట్స్, క్యాప్, ట్రయాన్, బోష్, డె క్లెర్క్, సినాలో జఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగ ఖఖా, నాన్ కులెలోక్కో మ్లాబా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.