Home /News /sports /

AUS VS SL ODI SERIES UMPIRE KUMAR DHARMASENA TRYS TO CATCH THE BALL DURING THE MATCH BETWEEN AUSTRALIA VS SRI LANKA SJN

AUS vs SL : ఈ అంపైర్ కు మతి భ్రమించినట్లుంది.. అందుకే అంపైరింగ్ వదిలేసి ఇలా చేశాడు

PC : TWITTER

PC : TWITTER

AUS vs SL : ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australaia) క్రికెట్ జట్టు శ్రీలంక (Sri Lanka)లో పర్యటిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో సిరీస్ లు జరుగతున్న సంగతి తెలిసిందే. తొలుత మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగ్గా.. అందులో ఆసీస్ జట్టు 2-1తో శ్రీలంకపై విజయం సాధించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
AUS vs SL : ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australaia) క్రికెట్ జట్టు శ్రీలంక (Sri Lanka)లో పర్యటిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో సిరీస్ లు జరుగతున్న సంగతి తెలిసిందే. తొలుత మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగ్గా.. అందులో ఆసీస్ జట్టు 2-1తో శ్రీలంకపై విజయం సాధించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతోంది. మూడో వన్డే ఆదివారం జరగ్గా అందులో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో స్క్వేర్ లెగ్ లో అంపైరింగ్ చేస్తోన్న కుమార ధర్మసేన (Kumar Dharmasena).. కాసేపు తాను అంపైర్ అనే విషయాన్ని మరిచిపోయాడు. శ్రీలంక జట్టు తరఫున ఫీల్డింగ్ చేసే ప్రయత్నం చేశాడు.

ఇది కూడా చదవండి  : అప్పుడు ప్రపంచకప్ గెలిచాడు.. ఇప్పుడు శ్రీలంకలో టీ సర్వ్ చేస్తున్నాడు..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో అలెక్స్ స్క్వేర్ లెగ్ దిశలో షాట్ ఆడాడు. అది కాస్తా అక్కడే అంపైరింగ్ చేస్తోన్న కుమార ధర్మసేన దగ్గరకు వెళ్లింది. అయితే మనోడు క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే తాను అంపైర్ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని బంతికి అడ్డుపడకుండా పక్కకు తప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి కుమార ధర్మసేన శ్రీలంక జట్టుకు ఆడాడు కూడా. 1996లో జరిగిన ప్రపంచకప్ లో శ్రీలంక జట్టుకు ధర్మసేన ప్రాతినిధ్యం వహించాడు. ఆ ఆ ప్రపంచకప్ లో శ్రీలంక విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక భారత్ తో జరిగిన సెమీఫైనల్లో దూకుడు మీదున్న సచిన్ ను ధర్మసేన పెవిలియన్ కు పంపి.. మ్యాచ్ గతినే మార్చేశాడు. ఇక 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓవర్ త్రో రన్స్ విషయంలో ధర్మసేన తప్పుగా వ్యవహరించి విమర్శల పాలైయ్యాడు.





ఇక మూడో వన్డేలోనూ ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (70 నాటౌట్), అలెక్స్ క్యారీ (49), అరోన్ ఫించ్ (62), మ్యాక్స్ వెల్ (33) రాణించారు. వాండర్ సే 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్ కు దిగన శ్రీలంక 48.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 292 పరుగులు చేసి గెలిచింది. నిస్సంక (137) శతకం బాదాడు. కుశాల్ మెండీస్ (87) రాణించాడు. వీరిద్దరి దెబ్బకు ఆసీస్ బౌలర్లు మూడు చెరువుల నీళ్లు తాగారు. 2013 తర్వాత ఆసీస్ పై వరుసగా రెండు వన్డే మ్యాచ్ ల్లో నెగ్గడం శ్రీలంకకు ఇదే తొలిసారి. సిరీస్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికగా.. లంక 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో వన్డే మంగళవారం జరగనుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, David Warner, Dinesh Karthik, Glenn Maxwell, India vs australia, India vs srilanka, Rohit sharma, Sri Lanka, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు