Home /News /sports /

AUS VS SL FLYING WICKET BAIL HITS DAVID WARNER IN THE CROTCH SJN

David Warner : డేవిడ్ భాయ్ తాట తీసిన బెయిల్.. పాపం మైదానంలోనే విలవిల్లాడిన ఆసీస్ స్టార్

PC : TWITTER

PC : TWITTER

David Warner : శ్రీలంక (Sri Lanaka)తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. శనివారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆసీస్ ఈ మ్యాచ్ లో గెలిచినా డేవిడ్ వార్నర్ (David Warner) మాత్రం తెగ ఇబ్బంది పడిపోయాడు.

ఇంకా చదవండి ...
David Warner : శ్రీలంక (Sri Lanaka)తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. శనివారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆసీస్ ఈ మ్యాచ్ లో గెలిచినా డేవిడ్ వార్నర్ (David Warner) మాత్రం తెగ ఇబ్బంది పడిపోయాడు. మూడో రోజు ఆటలో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ఆడుతుండగా.. 23వ ఓవర్ ను ట్రావిస్ హెడ్ (Travis Head) వేయడానికి వచ్చాడు. జెఫ్రీ వాండెర్సె (8) స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్నాడు. ఆ ఓవర్ తొలి బంతిని వేయగా.. బంతి వికెట్లను గిరాటేసింది. వికెట్ తీశామన్న ఆనందంలో మిగిలిన ఆసీస్ ప్లేయర్స్ ఉండగా.. వార్నర్ మాత్రం పిచ్ పై పడి దొర్లుతూ కనిపించాడు. ఏంటా అని టీవీ రీప్లేలో చూస్తే.. బంతి వికెట్లను తగలగానే వాటికున్న బెయిల్స్ లో ఒకటి వెళ్లి.. వార్నర్ కు తగలరాని చోట తగిలింది.

ఇది కూడా చదవండి  : చిరుతలా పరుగెత్తే ధోనికి మోకాళ్ల నొప్పులా.! అతడి నాటు వైద్యం ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే?

అంతే పాపం వార్నర్.. ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయి విలవిల్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాపం వార్నర్ కు ఎంత కష్టమొచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ లో అప్పుడప్పుడ బాల్ వెళ్లి బ్యాటర్ పొత్తికడుపు కింది భాగంలో తగలడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం బెయిల్ తగిలింది. దాంతో బెయిల్ వార్నర్ తాట తీసిందిగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే వన్డే సిరీస్ లో ఓడిన ఆస్ట్రేలియా.. టెస్టు సిరీస్ లో అదరగొట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 212 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్ లో113 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 321 పరుగులు చేసింది. దాంతో ఆసీస్ ముందు శ్రీలంక 5 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వికట్ పడకుండా కేవలం 4 బంతుల్లోనే మ్యాచ్ ను పూర్తి చేసిన ఆసీస్ సిరీస్ లో శుభారంభం చేసింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, David Warner, Glenn Maxwell, India vs england, Pat cummins, Rohit sharma, Sri Lanka, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు