Home /News /sports /

AUS VS SL 2ND TEST SRI LANKA BATTER PATHUM NISSANKA TESTED COVID 19 POSITIVE DURING 2ND TEST MATCH AGAINST AUSTRALIA SJN

AUS vs SL : మ్యాచ్ మధ్యలో కరోనా కలకలం.. శ్రీలంకలో వణికిపోతున్న ఆసీస్ క్రికెటర్లు.. ఏం జరిగిందంటే?

PC : TWITTER

PC : TWITTER

AUS vs SL : గాలే వేదికగా శ్రీలంక (Sri Lanka)తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ మధ్యలో కరోనా (Corona) కలకలం చెలరేగింది. శ్రీలంక జట్టుపై కరోనా పంజా విసురుతూనే ఉంది. తొలి టెస్టుకు ముందు లంక స్టార్‌ ఆటగాడు ఏంజలో మాథ్యూస్‌ (angelo mathews) కరోనా బారిన పడి మ్యాచ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
AUS vs SL : గాలే వేదికగా శ్రీలంక (Sri Lanka)తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ మధ్యలో కరోనా (Corona) కలకలం చెలరేగింది. శ్రీలంక జట్టుపై కరోనా పంజా విసురుతూనే ఉంది. తొలి టెస్టుకు ముందు లంక స్టార్‌ ఆటగాడు ఏంజలో మాథ్యూస్‌ (angelo mathews) కరోనా బారిన పడి మ్యాచ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జట్టు మొత్తానికి జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో మరో నలుగురికి (ప్రవీణ్‌ జయవిక్రమ, ధనంజయ డిసిల్వ, జెఫ్రె వాండర్సే, అషిత ఫెర్నాండో) కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా శ్రీలంక జట్టులో మరో కరోనా కేసు నమోదైంది.  మూడో రోజు ఆట మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దాంతో అతడు మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంల ో ఒషాడో ఫెర్నాండో కోవిడ్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు.

నిస్సంక కూడా కరోనా బారిన పడటంతో కోవిడ్ 19 బారిన పడ్డ శ్రీలంక ఆటగాళ్ల జాబితా 6కు చేరుకుంది. శ్రీలంక జట్టులో వరుసగా కోవిడ్‌ కేసులు వెలుగుచూస్తున్నా ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. కరోనా కేసులు నమోదైనా మ్యాచ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఓవర్ నైట్ స్కోరు 6 వికెట్లకు 431 పరుగులతో నాలుగో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 554 పరుగులకు ఆలౌటైంది. దినేవ్ చండీమల్ (206; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ దిముత్ కరుణ రత్నే (86; 10 ఫోర్లు), కుశాల్ మెండీస్ (85; 9 ఫోర్లు), కమిందు మెండిస్ (61; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 4, స్వెప్సన్‌ 3, లయన్‌ 2, కమిన్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.



అనంతరం ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు మాత్రమే చేసింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే ఆసీస్ మరో 116 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ వార్నర్ (24), ఉస్మాన్ ఖాజా (29) నిరాశ పరిచారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ (0) డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుషేన్ (15 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (5 బ్యాటింగ్) ఉన్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, Corona, Covid 19 restrictions, David Warner, Glenn Maxwell, Pat cummins, Sri Lanka, Steve smith

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు