మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న రెండో టెస్టులో కూడా సౌతాఫ్రికా (South Africa) చిత్తు చిత్తుగా ఓడిపోయింది. తొలి టెస్టులో రెండు రోజుల్లోనే చిత్తయిన దక్షిణాఫ్రికా.. రెండో టెస్టులోనూ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, మూడు మ్యాచుల సిరీస్ లో మరో గేమ్ మిగిలుండగానే.. 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ లో టెంబా బవుమా (144 బంతుల్లో 65 పరుగులు ; 6 ఫోర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
వీరన్నే (33), డి బ్రయన్ (28), సరెల్ ఎర్వీ (21) రాణించారు. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ డకౌటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ మూడు వికెట్లతో తీన్మార్ ఆడాడు. స్కాట్ బోలాండ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
Another statement made by Australia in the #WTC23 race ???? They travel to Sydney with an unassailable 2-0 series lead over South Africa. Watch the rest of the #AUSvSA series LIVE on https://t.co/CPDKNxpgZ3 (in select regions) ???? Scorecard ???? https://t.co/FKgWE9ksfC pic.twitter.com/ejVw9wxN9F
— ICC (@ICC) December 29, 2022
ఇక ఆస్ట్రేలియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 575/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో.. ఆస్ట్రేలియాకు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 386 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. డేవిడ్ వార్నర్ (255 బంతుల్లో 200 పరుగులు ; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ కేరీ (111) సెంచరీ సాధించాడు.
స్టీవ్ స్మిత్ (85), ట్రావిస్ హెడ్ (51), కామెరూన్ గ్రీన్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. దీంతో.. ఆస్ట్రేలియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే మూడు వికెట్లు తీశాడు. కగిసో రబాడాకి రెండు వికెట్లు దక్కాయి. లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇక, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి ఇది వందో టెస్టు. గత కొన్నాళ్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వార్నర్.. కెరీర్ వందో టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగాడు. వార్నర్ దంచుడుతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. దాదాపు మూడేండ్ల తర్వాత వార్నర్ సెంచరీతో కదం తొక్కాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల విమర్శల పాలవుతున్న వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కక్ష సాదిస్తుంది. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత తనపై విధించిన కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తేయాల్సిందిగా వార్నర్ మొర పెట్టుకున్నా.. సీఏ సరైన రీతిలో స్పందించలేదనే చెప్పాలి.
ముందు ఆటగాడిగా సత్తాచాటితే ఆ తర్వాత నాయకత్వంపై మాట్లాడొచ్చు అని పేర్కొంది. దీంతో రగిలిపోయిన ఈ ఓపెనర్.. దక్షిణాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడాడు. డబుల్ సెంచరీ అనంతరం ఆ కసి అతడి కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు మార్క్‌వా (8029)ను దాటేసిన వార్నర్ (8122) ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఏడో స్థానానికి ఎగబాకాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Cricket, David Warner, Pat cummins, South Africa, Steve smith