హోమ్ /వార్తలు /క్రీడలు /

AUS vs PAK: వాళ్లు ఖైదీలు కాదు... క్రికెటర్లు... పీసీబీ నిర్వాకంతో పాక్ లో ఆసీస్ క్రికెటర్ల ఫుడ్ కష్టాలు

AUS vs PAK: వాళ్లు ఖైదీలు కాదు... క్రికెటర్లు... పీసీబీ నిర్వాకంతో పాక్ లో ఆసీస్ క్రికెటర్ల ఫుడ్ కష్టాలు

మార్నస్ లబుషేన్ లంచ్ (PC: TWITTER)

మార్నస్ లబుషేన్ లంచ్ (PC: TWITTER)

AUS vs PAK: ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. ఆ ట్వీట్ చూసిన క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముంది.

ఇంకా చదవండి ...

AUS vs PAK: శ్రీలంక (Sri lanka) క్రికెట్ జట్టుపై ఉగ్రమూకల దాడి తర్వాత పాకిస్తాన్ (Pakistan)లో సిరీస్ ఆడేందుకు దశాబ్దానికి పైగా ఏ జట్టు సాహసం చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే ఆ దేశంలో పలు జట్లు పర్యటించడానికి ముందుకు వస్తున్నాయి. తొలుత జింబాబ్వే ఆ తర్వాత వెస్టిండీస్ (Westi Indies), శ్రీలంక లాంటి జట్లు అక్కడ సిరీస్ లు ఆడాయి. అయితే ఆస్ట్రేలియా (Australia) లాంటి పెద్ద జట్లు అక్కడ అడుగు పెట్టలేదు. గతేడాది న్యూజిలాండ్ (New Zealand) టీం అక్కడ ఆడేందుకు అడుగుపెట్టినా... భద్రతా కారణాల రిత్యా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే కివీస్ టీం తిరుగు ప్రయాణం అయ్యింది. అయితే తాజాగా పాకిస్తాన్ లో  దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆసీస్ టీం పర్యటిస్తోంది.  ఈ పర్యటన సక్సెస్ ఫుల్ గా పూర్తయితే పాక్ లో పర్యటించేందుకు మిగిలిన టాప్ టీమ్స్ కూడా రెడీ అవుతాయి. ఆసీస్ టీం పాకిస్తాన్ కు బంగారు బాతు లాంటిది. అలాంటి టీంను ఎలా చూసుకోవాలి. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆస్ట్రేలియా ఆటగాళ్లను సరిగ్గా చూసుకోవడం లేదు. వారికి కావల్సిన ఆహారాన్ని కూడా అందివ్వడం లేదు.

ప్రస్తుతం పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ తొలి రోజు లంచ్ సందర్భంగా ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ ట్విట్టర్ లో పెట్టిన ఓ ఫోటో వైరల్ అయ్యింది. ’లంచ్ కు కూడా మళ్లీ రొట్టె, దాల్... అయినా బాగుంది‘ అంటూ లబుషేన్ తన లంచ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతే క్రికెట్ అభిమానులు పీసీబీపై ట్రోల్స్ షూరూ చేశారు.

లబుషేన్ ట్వీట్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్ పీసీబీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ’అది క్రికెటర్లకు పెట్టే ఫుడ్ లా లేదు జైళ్లలో ఖైదీలకు పెట్టే ఫుడ్ ల ా ఉంది‘ అని ’ పెషావర్ జైలులో పెట్టే ఫుడ్ ను ఆస్ట్రేలియా ప్లేయర్స్ కు పెట్టినట్లు ఉన్నారు‘ అని కొందరు ట్వీట్స్ చేస్తూ పీసీబీని ట్రోల్స్ చేస్తున్నారు.

First published:

Tags: Australia, Pakistan, Sri Lanka, West Indies

ఉత్తమ కథలు