AUS vs IND, 1st ODI: వార్నర్ చేసిన పనికి ఇండియన్స్ ఫిదా.. వైరల్ వీడియో

హార్దిక్ పాండ్యాకు షూ లేస్ కడుతున్న డేవిడ్ వార్నర్

ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ (David warner) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) జట్టుకు నాయకత్వం వహించగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

  • Share this:
    AUS vs IND, 1st ODI: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారత్‌కు చాలా దగ్గరయ్యాడు. ఐపీఎల్ పుణ్యమా అని.. మనలో ఒకడిలా కలిసిపోయాడు. టాలీవుడ్‌, బాలీవుడ్ పాటలకు అప్పుడప్పుడూ స్టెప్పులేస్తూ సందడి చేస్తూ.. భారత అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా మరోసారి భారతీయులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. తాను ఎంత సింపుల్‌గా ఉంటాడో.. ప్రత్యర్థి ఆటగాళ్లకు ఎంత గౌరవం ఇస్తాడో.. మరోసారి నిరూపించాడు. ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు డేవిడ్ వార్నర్. టీమిండియా ఆల్‌రౌండర్‌కు షూ లేస్ కట్టి.. శభాష్ అనిపించుకున్నాడు.

    భారత్ ఇనింగ్స్‌లో 32 ఓవర్లో హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ క్రీజులో ఉన్నారు. హేజిల్‌వుడ్ మూడు బంతులు వేసిన తర్వాత.. పాండ్య షూ లేస్ వదులయ్యాయి. తాను లేస్ కట్టుకోవాలంటే గ్లౌవ్స్ తీయాలి. అతడిని పరిస్థితిని అర్థం చేసుకున్న డేవిడ్ వార్నర్.. వెంటనే పాండ్యా వద్దకు వచ్చాడు. కింద కూర్చొని పాండ్యా షూ లేస్ కట్టాడు. ప్రస్తుతం ఆ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా పోస్ట్ చేయడంతో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    వార్నర్ చేసిన పనికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. స్టార్ ఆటగాడన్న ఆటిట్యూట్ చూపించకుండా.. ప్రత్యర్థి ఆటగాడికి సాయం చేశాడని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. గతంలో ఆసీస్ క్రికెటర్లు ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేసి రెచ్చగొట్టేవారని.. కానీ వార్నర్ అలాంటి వాడు కాదని ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా నువ్వు.. జెంటిల్‌మెన్ అని కొనియాడుతున్నారు.







    ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించగా.. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

    కాగా, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. 66 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (114), స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో చెలరేగా.. వార్నర్ (69), మాక్స్‌వెల్ (45) రన్స్‌తో ఆకట్టుకున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 రన్స్ మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా 90, శిఖర్ ధావన్ 74 పరుగులు చేశారు. మిగతావారు పెద్దగా రాణించలేదు. జంపా 4, హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టారు.
    Published by:Shiva Kumar Addula
    First published: