Matthew Wade : ఆస్ట్రేలియా (Australia) క్రికెటర్లు మైదానంలో ఎలా ఉంటారో 2000వ దశకంలో క్రికెట్ చూసిన ప్రతి ఒక్కరికి బాగా తెలిసే ఉంటుంది. గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలన్నా తొక్కడానికి రెడీగా ఉంటారు. ఫీల్డింగ్ (fielding) చేసే సమయంలో పొజిషన్ మారుతూ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న వికెట్ బెయిల్స్ ను చేతి వేళ్లతో పడేసి హిట్ వికెట్ కోసం అప్పీల్ చేయడం.. నేలకు తాకిన బంతిని పట్టి క్యాచ్ అంటూ సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు అవుటంటూ అంపైర్ కే చెప్పడం ఆస్ట్రేలియా ప్లేయర్లకే చెందింది. అయితే ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు అప్పటిలా మైదానంలో దూకుడుగా ఉండటం లేదు. అయితే సందు దొరికినప్పుడల్లా బాల్ ట్యాంపరింగ్ వివాదాలతో తమ చెడ్డతనాన్ని ప్రపంచానికి తెలియచేస్తునే ఉన్నారు.
ఇది కూడా చదవండి : టి20 ప్రపంచకప్ లో టీమిండియా సిక్సర్ల వీరులు వీరే.. ధోని ఎన్నో స్థానంలో ఉన్నాడంటే?
ఇక తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టి20లో కూడా ఆస్ట్రేలియా తొండాట ఆడింది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 16 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. చివరి 4 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో వార్నర్ తో పాటు మ్యాథ్యూ వేడ్ ఉన్నాడు. ఇక 17వ ఓవర్ ను వేయడానికి మార్క్ వుడ్ వచ్చాడు. మూడో బంతిని వేడ్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయతే బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలి స్ట్రయికింగ్ ఎండ్ వికెట్ల దగ్గరే గాల్లోకి లేచింది. వేడ్ పరుగు కోసం ముందుకు వెళ్లాడు. వార్నర్ వద్దంటూ వెనక్కి పంపాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేచిన విషయాన్ని వేడ్ అర్థం చేసుకున్నాడు. ఇక వుడ్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించగా.. ఫుట్ బాల్ మైదానంలో స్ట్రయికర్ ను డిఫెండర్ ఎలా అయితే అడ్డుకుంటాడో అలా వుడ్ ను అడ్డుకున్నాడు. ఇది ఒకరకంగా అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్.. అవుట్ కాకుండా ఫీల్డర్ ను బ్యాటర్ అడ్డుకుంటే అంపైర్ అవుట్ గా ప్రకటిస్తాడు. అయితే అక్కడ ఉన్న ఫీల్డ్ అంపైర్లు ఇదంతా చూసి కూడా తమకు ఏం తెలీదు అన్నట్లు ఉన్నారు. ఇక ఆసీస్ కామెంటేటర్లు అయితే ఫన్నీ ఇన్సిడెంట్ అంటూ కుళ్లు జోక్స్ వేశారు. వేడ్ ఏ విధంగా తొండాట ఆడాడో మీరూ చూడండి.
Mathew Wade cheated pic.twitter.com/GCzel2N2p1
— Rohit45 (@KarnarohitMahe2) October 9, 2022
Mathew wade obstructing the field? Spirit of the game where?? pic.twitter.com/XZIsnM3mcR
— Div???? (@div_yumm) October 9, 2022
Mathew Wade- The cheater. https://t.co/KBbNhViybD
— Sabuktageen Khan Afridi (@SabukAfridi) October 9, 2022
అయితే దేవుడు మాత్రం సరైన ఫలితాన్నే ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. . ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును గెలిపించేందుకు కడవరకు పోరాడాడు. మిచెల్ మార్ష్ (36), స్టొయినస్ (35)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఒక దశలో ఆసీస్ ఈజీగా గెలిచేలా కనిపించింది. అయితే మార్క్ వుడ్ ఒకే ఓవర్లో స్టొయినస్ తో పాటు డేంజరస్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (0)లను అవుట్ చేశాడు. ఇక చివర్లో వార్నర్ కూడా పెవిలియన్ కు చేరాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, England, England vs Australia, Steve smith