AUS vs ENG 1st ODI : అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య గురువారం తొలి వన్డే జరగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆస్టన్ అగర్ (Ashton Agar) సూపర్ ఫీల్డింగ్ తో అదరగొట్టేశాడు. బౌండరీ లైన్ దగ్గర అద్భుత విన్యాసంతో సిక్సర్ వెళ్లాల్సిన బంతిని ఆపేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కమిన్స్ వేసిన 45వ ఓవర్ ఆఖరి బంతిని డేవిడ్ మలాన్ ఫుల్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశలో సిక్సర్ వెళ్లేలా కనిపించింది. అయితే అక్కడే ఉన్న అగర్ అద్భుతం చేసి చూపించాడు.
వేగంగా వచ్చిన బంతిని గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు. అప్పటికి అగర్ బౌండరీ లైన్ పై గాల్లో ఉన్నాడు. దాంతో వెంటనే బంతిని బౌండరీ లైన్ ఆవలకు విసిరేసి సిక్సర్ కాకుండా అడ్డుకున్నాడు. ఇదంతా కూడా క్షణం కంటే తక్కువ సమయంలో జరగడం విశేషం. క్విక్ రియాక్షన్ తో జట్టుకు ఏకంగా ఐదు పరుగులు సేవ్ చేశాడు అగర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆలస్యం దేనికి మీరూ చూసేయండి మరి.
That's crazy! Take a bow, Ashton Agar #AUSvENG pic.twitter.com/FJTRiiI9ou
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 134; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. చివర్లో డేవిడ్ విల్లీ (34 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. దాంతో ఇంగ్లండ్ భారీ స్కోరును అందుకుంది. వీరు మినహా మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆడమ్ జంపా, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెరో మూడు వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్ చెరో వికెట్ సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా పేసర్లు స్టార్క్, కమిన్స్ లు బెదరగొట్టారు. పదునై బంతులతో ఇంగ్లండ్ ఓపెనర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఓపెనర్లుగా వచ్చిన జేసన్ రాయ్ ఫిల్ సాల్ట్ లను హడలెత్తించారు. రాయ్ (6)ని అద్భుత ఇన్ స్వింగర్ తో స్టార్క్ పెవిలియన్ కు చేర్చాడు. సాల్ట్ కమిన్స్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జేమ్స్ విన్స్ (5) అలా వచ్చి ఇలా వెళ్లాడు. మిడిలార్డర్ లో వచ్చిన బట్లర్ (29) ఫర్వాలేదనిపించాడు.
ఈ దశలో మరో ఎండ్ లో ఉన్న మలాన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా ఓపికతో ఆడిన మలాన్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముఖ్యంగా డేవిడ్ విల్లీతో కలిసి ఎనిమిదో వికెట్ కు 60 పరుగులు జోడించాడు. సెంచరీ చేసిన అనంతరం 8వ వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో విల్లీ భారీ షాట్లు ఆడటంతో ఇంగ్లండ్ 287 పరుగులు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, England, England vs Australia, Pat cummins, Steve smith