AUS vs ENG 1st ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డే లో ఆతిథ్య ఆస్ట్రేలియా (Australia) జట్టుకు ఇంగ్లండ్ (England) భారీ టార్గెట్ నే నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 134; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. చివర్లో డేవిడ్ విల్లీ (34 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. దాంతో ఇంగ్లండ్ భారీ స్కోరును అందుకుంది. వీరు మినహా మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆడమ్ జంపా, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెరో మూడు వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్ చెరో వికెట్ సాధించారు.
ఇది కూడా చదవండి : ఈ ముగ్గురిపై కన్నేసిన సన్ రైజర్స్.. ఎంతైనా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధం!
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా పేసర్లు స్టార్క్, కమిన్స్ లు బెదరగొట్టారు. పదునై బంతులతో ఇంగ్లండ్ ఓపెనర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఓపెనర్లుగా వచ్చిన జేసన్ రాయ్ ఫిల్ సాల్ట్ లను హడలెత్తించారు. రాయ్ (6)ని అద్భుత ఇన్ స్వింగర్ తో స్టార్క్ పెవిలియన్ కు చేర్చాడు. సాల్ట్ కమిన్స్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జేమ్స్ విన్స్ (5) అలా వచ్చి ఇలా వెళ్లాడు. మిడిలార్డర్ లో వచ్చిన బట్లర్ (29) ఫర్వాలేదనిపించాడు.
STARC! A trademark inswinger from the big quick! #AUSvENG#PlayOfTheDay | #Dettol pic.twitter.com/94zYtKeNOE
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
ఈ దశలో మరో ఎండ్ లో ఉన్న మలాన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా ఓపికతో ఆడిన మలాన్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముఖ్యంగా డేవిడ్ విల్లీతో కలిసి ఎనిమిదో వికెట్ కు 60 పరుగులు జోడించాడు. సెంచరీ చేసిన అనంతరం 8వ వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో విల్లీ భారీ షాట్లు ఆడటంతో ఇంగ్లండ్ 287 పరుగులు చేసింది.
తుది జట్లు
ఇంగ్లండ్
జేసన్ రాయ్, సాల్ట్, మలాన్, జేమ్స్ విన్స్, స్యామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ డాసన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, ల్యూక్ వుడ్, ఒల్లీ స్టోన్
ఆస్ట్రేలియా
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్రీన్, మార్కస్ స్టొయినిస్, అగర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడం జంపా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, England, England vs Australia, Pat cummins, Steve smith