హోమ్ /వార్తలు /క్రీడలు /

AUS vs ENG 1st ODI : ప్రపంచ ఛాంపియన్లకు ఆస్ట్రేలియా చేతిలో చావుదెబ్బ.. ఫస్ట్ వన్డేలో ఇంగ్లండ్ చిత్తు..

AUS vs ENG 1st ODI : ప్రపంచ ఛాంపియన్లకు ఆస్ట్రేలియా చేతిలో చావుదెబ్బ.. ఫస్ట్ వన్డేలో ఇంగ్లండ్ చిత్తు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

AUS vs ENG 1st ODI : టీ20 వరల్డ్ కప్ 2022 గెలిచిన తర్వాత విశ్వవిజేతలు ఇంగ్లండ్ కు తొలి ఝలక్ తగిలింది. ఆ జట్టును ఆస్ట్రేలియా చావు దెబ్బ కొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీ20 వరల్డ్ కప్ 2022 గెలిచిన తర్వాత విశ్వవిజేతలు ఇంగ్లండ్ కు తొలి ఝలక్ తగిలింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డే లో ఆతిథ్య ఆస్ట్రేలియా (Australia).. ఇంగ్లండ్ జట్టును ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 287 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఆ లక్ష్యాన్ని 46.5 ఓవర్లలోనే అందుకుంది. 46.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 291 పరుగుల చేసి.. ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (84 బంతుల్లో 86 పరుగులు ; 10 ఫోర్లు, 1 సిక్సర్), స్టీవ్ స్మిత్ (78 బంతుల్లో 80 పరుగులు నాటౌట్.. 9 ఫోర్లు, 1 సిక్సర్), ట్రావిస్ హెడ్ (57 బంతుల్లో 69 పరుగులు ; 10 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. అలెక్స్ కేరీ (28 బంతుల్లో 21 పరుగులు ; 3 ఫోర్లు), కామోరూన్ గ్రీన్ (28 బంతుల్లో 20 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు వికెట్లతో సత్తా చాటాడు. క్రిస్ జోర్డా, లియామ్ డాసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

287 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ 19.4 ఓవర్లలోనే 147 పరుగుల భాగస్వామ్యాన్ని తొలి వికెట్ కు అందించారు. జోరు మీదున్న ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఔటైనా.. మిగతా బ్యాటర్లతో కలిసి స్టీవ్ స్మిత్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో.. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది ఆస్ట్రేలియా జట్టు.

అంతకు ముందు.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 134; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. చివర్లో డేవిడ్ విల్లీ (34 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. దాంతో ఇంగ్లండ్ భారీ స్కోరును అందుకుంది. వీరు మినహా మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆడమ్ జంపా, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెరో మూడు వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్ చెరో వికెట్ సాధించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా పేసర్లు స్టార్క్, కమిన్స్ లు బెదరగొట్టారు. పదునై బంతులతో ఇంగ్లండ్ ఓపెనర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఓపెనర్లుగా వచ్చిన జేసన్ రాయ్ ఫిల్ సాల్ట్ లను హడలెత్తించారు. రాయ్ (6)ని అద్భుత ఇన్ స్వింగర్ తో స్టార్క్ పెవిలియన్ కు చేర్చాడు. సాల్ట్ కమిన్స్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జేమ్స్ విన్స్ (5) అలా వచ్చి ఇలా వెళ్లాడు. మిడిలార్డర్ లో వచ్చిన బట్లర్ (29) ఫర్వాలేదనిపించాడు.

ఈ దశలో మరో ఎండ్ లో ఉన్న మలాన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా ఓపికతో ఆడిన మలాన్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముఖ్యంగా డేవిడ్ విల్లీతో కలిసి ఎనిమిదో వికెట్ కు 60 పరుగులు జోడించాడు. సెంచరీ చేసిన అనంతరం 8వ వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో విల్లీ భారీ షాట్లు ఆడటంతో ఇంగ్లండ్ 287 పరుగులు చేసింది.

First published:

Tags: Cricket, David Warner, England vs Australia, Pat cummins, Steve smith

ఉత్తమ కథలు