ఫెదరర్ తర్వాత నడాల్...ఎన్నోసారి ఫైనల్ చేరాడో తెలుసా..??

మోడ్రన్ టెన్నిస్‌లో రోజర్ ఫెదరర్‌ తర్వాత ఆ ఘనత సాధించిన ప్లేయర్‌గా చరిత్రను తిరగరాశాడు. ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లో ఫెదరర్‌ను ఓడించి సంచలనం సృష్టించిన సిసిపాస్...సెమీఫైనల్‌లో నడాల్‌ను అధిగమించలేకపోయాడు.

news18-telugu
Updated: January 24, 2019, 11:07 PM IST
ఫెదరర్ తర్వాత నడాల్...ఎన్నోసారి ఫైనల్ చేరాడో తెలుసా..??
రోజర్ ఫెదరర్, రఫాల్ నడాల్ ( Aus Open/ Wimbledon/ Twitter )
  • Share this:
ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్‌ అదరగొడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25వ సారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్ చేరి మోడ్రన్ టెన్నిస్‌లో రోజర్ ఫెదరర్‌ తర్వాత ఆ ఘనత సాధించిన ప్లేయర్‌గా చరిత్రను తిరగరాశాడు. 17 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన నడాల్...18వ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. టోర్నీ ఆరంభ మ్యాచ్ నుంచే అంచనాలకు మించి రాణిస్తున్న రాఫా సునాయాసంగా మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో ఎంటరయ్యాడు. సెమీఫైనల్‌లో గ్రీస్‌కు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ స్టెఫానోస్ సిసిపాస్‌ను చిత్తు చేశాడు. టైటిల్ ఫేవరెట్‌గా..రెండో సీడ్‌ హోదాలో బరిలోకి దిగిన నడాల్‌కు...12వ సీడ్‌గా సిసిపాస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. సెమీస్‌లో అపార అనుభవజ్ఞుడైన స్పానిష్ బుల్ నడాల్ జోరు ముందు తొలి సారిగా ఓ గ్రాండ్‌స్లామ్ సెమీస్ చేరిన సిసిపాస్ తేలిపోయాడు. ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లో గ్రాండ్‌స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్‌ను ఓడించి సంచలనం సృష్టించిన సిసిపాస్...సెమీఫైనల్‌లో అదే స్థాయిలో రాణించలేకపోయాడు.

6-2తో ఫస్ట్ సెట్ నెగ్గి శుభారంభం చేశాడు రాఫా.సెకండ్ సెట్‌లోనూ స్పానిష్ బుల్ జోరు కొనసాగింది. ప్రత్యర్ధి నుండి కొద్దిసేపు ప్రతిఘటించినా ఏ మాత్రం తడబడకుండా...6-4‌తో రెండో సెట్ నెగ్గి మ్యాచ్‌పై పట్టుబిగించాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో నడాల్‌కు అసలే మాత్రం పోటీనే లేకుండాపోయింది. 6-0తో ఆ సెట్ సైతం సొంతం చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించిన ఆనందంలో స్పానిష్ బుల్ సంబరాలు అంబరాన్నంటాయి.అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్‌లో అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టియాఫోయీపై వరుస సెట్లలో నెగ్గాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ఫైనల్ చేరడం నడాల్‌కు ఇది ఐదో సారి కావడం విశేషం. ఓవరాల్‌గా ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరడం ఇది 25వ సారి కావడం మరో విశేషం. ఫెదరర్ 30 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరి 20 సార్లు చాంపియన్‌గా నిలిచాడు. 24 ఫైనల్స్ ఆడిన రాఫా 17 టైటిల్స్ నెగ్గాడు.

సరిగ్గా పదేళ్ల క్రితం, 2009లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గాడు నడాల్. ఆ తర్వాత మూడు సార్లు ఫైనల్ చేరినా చాంపియన్‌గా నిలవలేకపోయాడు. దాంతో ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని తహతహలాడుతున్నాడు.

Published by: Prasanth P
First published: January 24, 2019, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading