పరుగులో ఓడి... మనసులు గెలిచాడు... అథ్లెట్‌పై ప్రశంసల జల్లు... సూపర్ వైరల్ వీడియో

ఇలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఎవరైనా సరే... పోటీలో తామే గెలవాలనుకుంటారు. అలాంటిది... అతను కావాలని ఎందుకు ఓడిపోయాడు?

news18-telugu
Updated: September 22, 2020, 8:29 AM IST
పరుగులో ఓడి... మనసులు గెలిచాడు... అథ్లెట్‌పై ప్రశంసల జల్లు... సూపర్ వైరల్ వీడియో
పరుగులో ఓడి... మనసులు గెలిచాడు... (credit - twitter)
  • Share this:
ఆ అథ్లెట్ ఎవరూ ఊహించని విధంగా చేశాడు. తాను గెలిచే అవకాశం ఉండీ... కావాలని ఓడిపోయి... అందరి మనసులూ గెలుచుకున్నాడు. ఇతర ప్లేయర్లు, అభిమానులు, సోషల్ మీడియా నెటిజన్లు అంతా అతన్ని మెచ్చుకుంటున్నారు. పరుగులో ఓడినా... మంచితనంతో కోట్ల మంది హృదయాల్ని గెలుచుకున్నాడు. అసలేం జరిగిందంటే... స్పెయిన్‌... బార్సిలోనాలో ట్రయథ్లాన్‌ నిర్వహించారు. అందులో పరుగుపందెంతోపాటూ... మరికొన్ని పోటీలు జరుపుతున్నారు. స్పెయిన్‌కు చెందిన అథ్లెట్‌ డియాగో మెట్రిగో రన్నింగ్ పోటీలో... మూడోస్థానంలో ఉన్నాడు. మరికొన్ని సెకండ్లలో అతను గెలవడం ఖాయం. అలాంటి సమయంలో అతను ఎవరూ ఊహించని విధంగా చేశాడు. తన వెనక వస్తున్న ప్లేయర్ మూడోస్థానం దక్కించుకునేలా చేసి... అందరి మెప్పూ పొందాడు.

చివరి సెకండ్లలో... మెట్రిగో... కావాలనే వెళ్లాల్సిన వైపు వెళ్లకుండా... పక్కనున్న రెయిలింగ్ వైపు పరుగెత్తాడు. అరే ఇటు వచ్చానేంటి... అన్నట్లుగా నటిస్తూ... మళ్లీ పరుగు ప్రారంభించాడు. అప్పటికే... తన వెనక ఉన్న బ్రిటన్ అథ్లెట్ జేమ్స్ టియాగిల్ ముందుకు వెళ్లి... టార్గెట్ చేరుకున్నాడు. ఈ విషయాన్ని జేమ్స్‌తోపాటూ... అభిమానులంతా చూశారు. అందరికీ ఇది ఆశ్చర్యం కలిగించింది. తనను గెలిపించినందుకు జేమ్స్ వెంటనే థాంక్స్ చెప్పాడు.



అసలు మెట్రిగో ఇలా ఎందుకు చేశాడంటే... టార్గెట్ చేరుకునేవరకూ... జేమ్సే... మెట్రిగో కంటే వేగంగా పరుగెత్తాడు. అందువల్ల మూడోస్థానంలో జేమ్సే గెలుస్తాడని మెట్రిగో అనుకున్నాడు. కానీ... టార్గెట్ చేరువయ్యే సమయంలో... జేమ్స్ నెమ్మదించాడు. తద్వారా మెట్రిగోకి గెలిచే ఛాన్స్ వచ్చింది. కానీ... ఆ పరుగులో... మూడోస్థానానికి జేమ్సే అర్హుడని మెట్రిగో భావించాడు. అందుకే అతన్నే గెలిపించాడు.మెట్రిగో క్రీడాస్ఫూర్తిని అక్కడ ఉన్న ప్రేక్షకులు చప్పట్లోతో మెచ్చుకున్నారు. ఈ పరుగుల వీడియో ఇప్పుడు సూపర్ వైరల్ అయ్యింది. ట్విటర్‌లో సెప్టెంబర్ 20న పోస్టు చేసిన ఆ వీడియోని ఇప్పటికే 80 లక్షల మందికి పైగా చూశారు. గంటగంటకూ... లక్షల మంది చూస్తున్నారు. ఆ లిస్టులో మనమూ చేరిపోయాం.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 8:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading