భారత్, పాక్ మ్యాచ్‌లపై సౌరవ్ గంగూలీ కామెంట్స్...
టీమిండియా పాకిస్తాన్ మధ్య 2012లో చివరి మ్యాచ్ జరిగింది. రెండు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది.
news18-telugu
Updated: October 17, 2019, 5:38 PM IST

సౌరవ్ గంగూలీ (ఫైల్)
- News18 Telugu
- Last Updated: October 17, 2019, 5:38 PM IST
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ను అడగాలని కాబోయే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మళ్లీ పునరుద్ధరించే అంశం గురించి గంగూలీని ప్రశ్నించగా, ‘ఈ విషయం ప్రధాని మోదీ గారిని అడగాలి. అలాగే పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశ్నించాలి.’ అని కామెంట్ చేశాడు. ‘అంతర్జాతీయ మ్యాచ్‌లు, విదేశీ పర్యటనలు అంటే కచ్చితంగా ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి, దానికి సమాధానం మా దగ్గరలేదు.’ అని చెప్పాడు. టీమిండియా పాకిస్తాన్ మధ్య 2012లో చివరి మ్యాచ్ జరిగింది. రెండు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ ఈనెల 23న బాధ్యతలు చేపట్టనున్నారు. 2004లో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన తొలి సిరీస్ అదే. 1989లో తొలిసారి భారత్ క్రికెట్ సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటించింది.
పులిపిల్లను పట్టుకుని ఎలా హింసిస్తున్నారో చూడండి
పులిపిల్లను పట్టుకుని ఎలా హింసిస్తున్నారో చూడండి
Loading...