కాంస్యంతో సరిపెట్టుకున్న హాకీ పురుషుల జట్టు!

2-1 తేడాతో పాకిస్తాన్‌పై గెలిచిన టీమిండియా... డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి, కాంస్యంతో సరి!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 2, 2018, 10:42 AM IST
కాంస్యంతో సరిపెట్టుకున్న హాకీ పురుషుల జట్టు!
గోల్ చేసిన ఆనందంలో హాకీ జట్టు
  • Share this:
గత ఏషియాడ్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత హాకీ పురుషుల జట్టు, ఈ ఏడాది ఆసియా క్రీడల్లో కాంస్యం పతకంతో సరిపెట్టుకుంది. సెమీ ఫైనల్లో మలేషియా జట్టు చేతిలో షూటౌట్‌లో ఓడిన హాకీ మెన్స్ టీం... కాంస్య మెడల్ కోసం జరిగిన పోరులో దాయాది దేశాన్ని చిత్తుచేసింది. 2-1 తేడాతో పాకిస్తాన్‌పై గెలిచి, కొన్నేళ్లుగా దాయాదిలపై ప్రదర్శిస్తున్న ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే అద్భుతమైన ఫీల్డ్ గోల్ సాధించాడు ఆకాశ్ దీప్ సింగ్. రెండు, మూడు క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నించినా, అవేమీ సఫలం కాలేదు. నాలుగో క్వార్వర్ట్ 50వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని ఉపయోగించుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ సాధించి, జట్టు ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.

అయితే ఆ తర్వాత రెండు నిమిషాలకే పాక్ ఆటగాడు మహ్మద్ అతీక్ గోల్ చేసి, భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. అయితే ఆ తర్వాత మరోసారి సెమీఫైనల్ ఫలితం పునరావృత్తం కాకుండా పూర్తిగా డిఫెక్స్‌కే ప్రాధాన్యం ఇచ్చింది ఇండియన్ హాకీ టీం. దాంతో 2-1 తేడాతో విజయం భారత్ సొంతమైంది. గత నాలుగు నెలల కాలంలో పాకిస్తాన్ జట్టుపై హాకీలో ఇది రెండో విజయం. గత జూన్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోపీలోనూ 4-0 తేడాతో పొరుగు దేశాన్ని చిత్తు చేసింది హాకీ ఇండియా.

కాంస్య పతకం గెలిచిన మెన్స్ హాకీ టీంను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘ఏషియాడ్ 2018లో హాకీ ప్రదర్శన బాగుంది. కాంస్య పతకం గెలిచిన పురుషుల జట్టుకు అభినందనలు. ఇది కచ్చితంగా దేశవ్యాప్తంగా హాకీ పాపులారిటీ పొందడానికి కారణమవుతుంది...’ అంటూ ట్వీట్ చేశాడు పీఎం మోదీ.


Published by: Ramu Chinthakindhi
First published: September 2, 2018, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading