ఏషియాడ్: సైనా నెహ్వాల్‌కు ప్రధాని సహా ప్రముఖుల ప్రశంసలు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 27, 2018, 4:42 PM IST
ఏషియాడ్: సైనా నెహ్వాల్‌కు ప్రధాని సహా ప్రముఖుల ప్రశంసలు!
సైనా నెహ్వాల్ (పాత ఫోటో)
  • Share this:
ఏషియాడ్ 2018లో కాంస్య పతకం గెలిచిన సైనా నెహ్వాల్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గి, చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్ భారతదేశాన్ని గర్వించేలా చేశారు’ అంటూ ట్వీట్ చేసిన మోదీ, మహిళల బ్యాడ్మింటన్‌లో ఇది మొట్టమొదటి మెడల్ అని చెప్పారు. ‘మన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్‌కు ఇండియా అభినందనలు తెలుపుతోంది’ అంటూ పోస్ట్ చేశారు ప్రధాని.

‘ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో మనం ఓ మెడల్ సాధించాం. సైనా నెహ్వాల్ కాంస్యం సాధించారు. ఫ్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ అఛీవ్‌మెంట్’ అంటూ కేంద్ర మంత్రి, మాజీ షూటర్ రాజవర్థన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు.మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కూడా సైనాను అభినందించారు. ‘కాంస్య పతకం గెలిచిన నీకు అభినందనలు. నువ్వు ఇలాంటి విజయాలెన్నో సాధిస్తూ, మమ్మల్ని గర్వించేలా చేయాలని కోరుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్.ఏషియాడ్‌లో తీవ్రంగా నిరాశపర్చిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ కూడా సైనాకి అభినందనలు తెలిపారు. ‘దేశం కోపం పతకం గెలిచిన నీకు అభినందనలు. గర్వంగా ఉంది...’ అంటూ ట్వీట్ చేశాడు శ్రీకాంత్.ఒలింపిక్ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా... సైనాని అభినందించారు. ‘ఏషియన్ గేమ్స్ 2018లో ఇండియన్ బ్యాడ్మింటన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన నీకు అభినందనలు. భారత్ గర్విస్తోంది...’ అంటూ ట్వీట్ చేశాడు అభినవ్ బింద్రా.‘నా స్నేహితురాలికి అభినందనలు. 36 సంవత్సరాల ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో తొలి పతకం సాధించిన నువ్వు చరిత్ర సృష్టించావు. దేశం నిన్ను చూసి గర్విస్తోంది...’ అంటూ పోస్ట్ చేశాడు క్రికెటర్ సురేష్ రైనా.కేంద్ర మంత్రి పారాస్ జైన్ కూడా సైనాకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి...

ఏషియాడ్ 2018: సెమీస్‌లో ఓడిన సైనా, కాంస్యంతో సరి!


ఏషియాడ్: ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు!
First published: August 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు