హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AFG : భారత్ అభిమానులకు బిగ్ షాక్.. కెప్టెన్ ను మార్చేసిన టీమిండియా.. అఫ్గాన్ తో మ్యాచ్ తుది జట్లు ఇవే

IND vs AFG : భారత్ అభిమానులకు బిగ్ షాక్.. కెప్టెన్ ను మార్చేసిన టీమిండియా.. అఫ్గాన్ తో మ్యాచ్ తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

Asia cup 2022 - IND vs AFG : నామమాత్రంగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న అఫ్గానిస్తాన్ (Afghanistan) టీమిండియా (Team India) తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ (India) ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు రెస్ట్ ఇచ్చింది. కెప్టెన్ గా కేఎల్ రాహుల్ (KL Rahul) వ్యవహరించనున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia cup 2022 - IND vs AFG : నామమాత్రంగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న అఫ్గానిస్తాన్ (Afghanistan) టీమిండియా (Team India) తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ (India) ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు రెస్ట్ ఇచ్చింది. కెప్టెన్ గా కేఎల్ రాహుల్ (KL Rahul) వ్యవహరించనున్నాడు. మరోసారి భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ (Mohammad Nabi) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. రోహిత్, యుజువేంద్ర చహల్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చి.. వారి స్థానాల్లో దీపక్ చహర్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ లను తుది జట్టులోకి తీసుకుంది.మూడు మార్పులతో
ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా కెప్టెన్ కు రెస్ట్ ఇచ్చింది. దాంతో రోహిత్ బదులు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. హార్దిక్ పాండ్యాతో పాటు యుజువేంద్ర చహల్ లకు కూడా భారత్ రెస్ట్ ఇచ్చింది. వారి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. తొలి మ్యాచ్ లో అదరగొట్టిన తర్వాత హార్దిక్ కు రెస్ట్ ఇచ్చారు. అది అతడి ఫామ్ పై ప్రభావం చూపింది. సూపర్ 4లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ హార్దిక్ దారుణంగా విఫలం అయ్యాడు. అతడిని కొనసాగించకుండా రెస్ట్ ఇవ్వడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. టాస్ సమయంలో రాహుల్ మరో మాట కూడా అన్నాడు. టాస్ గెలిచినా బ్యాటింగే ఎంచుకునే వాళ్లం అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. స్టాండ్ బై గా ఉన్న దీపక్ చహర్.. అవేశ్ ఖాన్ అనారోగ్యం కారణంగా జట్టులోకి వచ్చాడు. అతడికి అఫ్గాన్ తో మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చారు. ఇక రోహిత్ స్థానంలో దినేశ్ కార్తీక్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.


హెడ్ టు హెడ్ 
భారత్, ఆఫ్గానిస్తాన్ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 7 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆరుసార్లు భారత్ గెలిచింది. ఇక 2018లో ఆసియా కప్ లో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. టి20ల్లో మూడు సార్లు తలపడగా మూడు సార్లు కూడా భారతే గెలిచింది.
తుది జట్లు
టీమిండియా
రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,  పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చహర్, భువనేశ్వర్, అర్ష్ దీప్ సింగ్
అఫ్గానిస్తాన్
నబీ (కెప్టెన్), గుర్బాజ్, జజాయ్, జద్రాన్, నజీబుల్ జద్రాన్, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్లా ఫరూఖీ

First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు