ASIA CUP HOCKEY TOURNMENT INDIA VS PAKISTAN HOCKEY MATCH DRAWAN 1 1 IN ASIA CUP SJN
IND vs PAK : 69 సెకన్లలో అంతా తారుమారు.. విజయం ముంగిట బోల్తా పడ్డ భారత్..
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (PC : TWITTER)
IND vs PAK : ఆసియా కప్ (Asia Cup) హాకీ టోర్నమెంట్ లో భారత (India) హాకీ జట్టు శుభారంభం చేయలేకపోయింది. 60 నిమిషాల ఆటలో 58 నిమిషాల పాటు ఆధిక్యం కనబరిచిన భారత హాకీ జట్టు చివరి నిమిషాల్లో తడబడింది. ఫలితంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై గెలవాల్సిన మ్యాచ్ ను డ్రాగా ముగించింది.
IND vs PAK : ఆసియా కప్ (Asia Cup) హాకీ టోర్నమెంట్ లో భారత (India) హాకీ జట్టు శుభారంభం చేయలేకపోయింది. 60 నిమిషాల ఆటలో 58 నిమిషాల పాటు ఆధిక్యం కనబరిచిన భారత హాకీ జట్టు చివరి నిమిషాల్లో తడబడింది. ఫలితంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై గెలవాల్సిన మ్యాచ్ ను డ్రాగా ముగించింది. ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా పూల్ ’ఎ‘లో సోమవారం పాకిస్తాన్ తో జరిగిన పోరును భారత్ 1-1తో డ్రాగా ముగించింది. ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించిన భారత జట్టు చివరి 69 నిమిషాల్లో తడబడింది. దాంతో పాకిస్తాన్ కు పెనాల్టీ కార్నర్ లభించగా ఎటువంటి తప్పు చేయని ఆ జట్టు గోల్ చేసి ఓటమి నుంచి బయటపడింది.
మ్యాచ్ లో భారత్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. పదే పదే ప్రత్యర్థి డి బాక్సులోకి చొచ్చుకువెళ్లి గోల్ కోసం ప్రయత్నాలు చేసింది. తొలి క్వార్టర్ 8వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ను ఎటువంటి తప్పు చేయకుండా గోల్ గా మలచిన భారత డ్రాగ్ ఫ్లికర్ కార్తిక్ సెల్వం భారత్ కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. అనంతరం కూడా భారత్ అద్భుతంగా ఆడింది. మరోవైపు పాకిస్తాన్ కు పెనాల్టీ కార్నర్స్ లభించినా వాటిని గోల్స్ గా మలచడంలో సఫలం కాలేదు. ఫలితంగా ఆట విరామ సమయానికి భారత్ దే పైచేయి నిలిచింది.
అయితే చివరి క్వార్టర్ అయిన నాలుగో క్వార్టర్ లో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే ఇరు జట్లు కూడా మరో గోల్ చేయడంలో సఫలం కాలేదు. ఈ క్రమంలో మ్యాచ్ లో భారత్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ, మ్యాచ్ 69 సెకన్లలో ముగుస్తుందనగా ఊహించని ట్విస్ట్ భారత్ ను విజయానికి దూరం చేసింది. పాకిస్తాన్ కు పెనాల్టీ కార్నర్ లభించగా.. దానిని సద్వినియోగం చేసిన రాణా.. 59వ నిమిషంలో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. ఫలితంగా గెలిచే మ్యాచ్ ను భారత్ డ్రాతో ముగించింది. ఇక ఈ రోజు జరిగిన ఇతర మ్యాచ్ ల్లో జపాన్ 9-0తో ఇండోనేసియాపై, మలేసియా 7-0తో ఒమన్ పై, కొరియా 6-1తో బంగ్లాదేశ్ పై విజయాలు సాధించాయి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.