ఆసియా కప్ (Asia Cup) హాకీ టోర్నమెంట్ లో భారత పురుషుల జట్టును దురదృష్టం వెంటాడింది. సూపర్ 4 లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియా తో జరిగిన మ్యాచ్ ను భారత పురుషుల జట్టు 4-4తో డ్రాగా ముగించింది. తప్పక గెలవాల్సిన చోట భారత్ జట్టు మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో గోల్స్ తేడాతో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. మరో మ్యాచ్ లో జపాన్ పై మలేసియా విజయం సాధించింది. దాంతో మలేసియా, దక్షిణ కొరియా, భారత్ జట్లు తలా ఐదు పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ, గోల్స్ డిఫరెన్స్ లో భారత్ కంటే కూడా మలేసియా, దక్షిణ కొరియా జట్లు మెరుగ్గా ఉండటంతో ఆ రెండు కూడా ఫైనల్ కు చేరాయి. భారత్, జపాన్ జట్లు సూపర్ 4తోనే తమ ప్రస్థానాన్ని ముగించాయి. రేపు మూడో స్థానం కోసం జపాన్ తో భారత్ తలపడనుంది.
భారత తరఫున నీలమ్ సంజీప్ (9వ నిమిషం), దిప్సన్ టిర్కీ (21వ నిమిషం), మహేశ్ (22వ నిమిషం), శక్తివేల్ మరీశ్వరణ్ (37వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. కొరియా జట్టులో జాంగ్ జాంగ్యూన్ (13వ నిమిషం), జీ వూ చియోన్ (18వ నిమిషం), కిమ్ జంగ్ హూ (28వ నిమిషం), జంగ్ మాంజే (44వ నిమిషం) గోల్స్ చేసి భారత్ విజయాన్ని అడ్డుకున్నారు.
A scintillating game ends in a DRAW!! 💙
IND 4:4 KOR #IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsKOR @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/eor7QdAZuB
— Hockey India (@TheHockeyIndia) May 31, 2022
సీనియర్ల గైర్హాజరిలో ఆసియా కప్ లో బరిలోకి దిగిన భారత జట్టు అద్భుత ఆటతీరును కనబర్చింది. ఫైనల్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ దూకుడు కనబర్చింది. తొలి క్వార్టర్ లో 9వ నిమిషంలో భారత్ కు లభించిన పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచిన సంజీప్ భారత్ కు తొలి గోల్ ను అందించాడు. అయితే కాసేపటికే గోల్ చేసిన జాంగ్ స్కోరును సమం చేశాడు. రెండో క్వార్టర్ ఆరంభమైన కాసేపటికే చియోన్ ఫీల్డ్ గోల్ చేసి కొరియాకు 2-1 ఆధిక్యాన్ని ఇచ్చాడు. వెంటనే తేరుకున్న భారత్ వెంట వెంటనే రెండు గోల్స్ చేసి 3-2తో ఆధిక్యంలో నిలిచింది. 28వ నిమిషంలో కొరియా గోల్ చేయగా.. 37వ నిమిషంలో భారత్ మరో గోల్ చేసింది దాంతో భారత్ 4-3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే 44వ నిమిషంలో జంగ్ గోల్ చేయడంతో మరోసారి స్కోర్లు సమం అయ్యాయి. ఇక చివరి క్వార్టర్ లో భారత్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాంతో మ్యాచ్ 4-4 తో డ్రాగా ముగిసింది. ఫలితంగా భారత్ ఫైనల్ కు చేరుకోవడంలో విఫలం అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hockey, India, IPL, IPL 2022, South korea, Team India