కుర్రాళ్లు కుమ్మేశారు... యంగిస్థాన్ ఖాతాలోకి అండర్ 19 ఆసియాకప్!

హాప్ సెంచరీలు చేసిన నలుగురు భారత బ్యాట్స్‌మెన్... ఆరు వికెట్లు తీసిన హర్ష్ త్యాగికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్... యశస్వి జెస్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 8, 2018, 10:45 AM IST
కుర్రాళ్లు కుమ్మేశారు... యంగిస్థాన్ ఖాతాలోకి అండర్ 19 ఆసియాకప్!
విజయానందంలో అండర్ 19 భారత జట్టు
  • Share this:
రోహిత్ సేన ఇచ్చిన ఉత్సాహంతో కుర్రాళ్లు కూడా చెలరేగిపోయారు. సీనియర్లు బంగ్లాదేశ్‌తో హోరాహోరీ పోరులో చివరి బంతికి విజయం సాధిస్తే... అండర్ 19 కుర్రాళ్లు మాత్రం అలవోకగా ఆసియాకప్ పట్టేశారు. ఫైనల్‌లో శ్రీలంకను 144 పరుగుల తేడాతో చిత్తుచేసిన అండర్ 19 భారత జట్టు... ఆరోసారి విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఆసియాకప్ అండర్ 19 టోర్నమెంట్‌లో ఏడుసార్లు ఆడిన యంగ్ టీమ్‌కి ఇది ఆరో టైటిల్ కావడం మరో విశేషం. గత ఏడాది మాత్రం ఆఫ్ఘానిస్థాన్ జట్టు ఆసియా కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు యశస్వి జెస్వాల్, అనూజ్ రావత్ మొదటి వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన అనూజ్ అవుటైన తర్వాత వచ్చిన దేవ్‌దత్త్ పడికల్ కూడా నిలకడగా ఆడాడు. 43 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 31 పరుగులు సాధించాడు. 113 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 85 పరుగులు చేసిన యశస్వి జెస్వాల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సిమ్రాన్ సింగ్... రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కేవలం 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి 65 పరుగులు చేసిన సిమ్రాన్ సింగ్‌కి, ఆయుష్ బోదని కూడా మంచి సహాకారం అందించాడు. ఆయుష్ 28 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేయడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక యువజట్టు ఏ దశలోనూ ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది.

Asia Cup Final India U19 vs Sri Lanka U19 Highlights: As it Happened కుర్రాళ్లు కుమ్మేశారు... యంగిస్థాన్ ఖాతాలోకి అండర్ 19 ఆసియాకప్!
ఓపెనర్ నిపున్ దనంజయ 12 పరుగులు చేసి మోహిత్ జంగ్రా బౌలింగ్‌లో అవుట్వడంతో 20 పరుగుల వద్ద లంక తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నిషాన్ మదుష్క, పసిందు సూరియబండారా కలిసి కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. పసిందు 31 పరుగులు చేయగా, ఆ తర్వాత వచ్చిన కలనా పెరెరా డకౌట్ అయ్యాడు. నివ్వానిదు ఫెర్నాడో 4 పరుగులు, నిషాన్ ముదష్క 49 పరుగులు చేసి అవుటవ్వయారు. దులిత్ 7, నిపున్ మలింగా డకౌట్, సందున్ మెండిస్ 1, కల్హారా సెనారత్నే 1 పరుగు చేసి అవుటయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన నవోద్ పరనవితన 48 పరుగులు దగ్గర అవుటవ్వడంతో లంక ఇన్నింగ్స్ 160 పరుగుల దగ్గర ముగిసింది.

భారత బౌలర్లలో మోహిత్ జంగ్రాకి ఒక్క వికెట్ దక్కగా, సిద్ధార్ధ్ దేశాయ్‌కి రెండు వికెట్లు దక్కాయి. ఆరు వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్ పతనానికి కారణమైన హర్ష్ త్యాగికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్‌లో మెరుగ్గా రాణించిన భారత ఓపెనర్ యశస్వి జెస్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వరించింది.
First published: October 8, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading