ASIA CUP ASIA CUP 2022 SET TO BE BEGIN FROM AUGUST 27TH IN SRI LANKA SJN
Asia cup: రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న టోర్నీకి ఎట్టకేలకు మోక్షం... ఆగస్టు 27 నుంచి శ్రీలంక వేదికగా ధనాధన్ టోర్నీ
జై షా (PC: ACC)
Asia cup: కరోనా వల్ల గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించి గుడ్ న్యూస్. ఈ టోర్నీని ఈ ఏడాది నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టోర్నీపై శనివారం కీలక ప్రకటన చేసింది.
Asia cup: క్రికెట్ (Cricket) ప్రియులకు శుభవార్త. గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న క్రికెట్ టోర్నమెంట్ ఆసియా కప్ పై గుడ్ న్యూస్ వచ్చేసింది. మనల్ని అలరించేందుకు ఈ టోర్నీ ఆగస్టులో మనముందుకు రానుంది. ఐపీఎల్ (IPL) ముగిసిన రెండు నెలల తర్వాత ఈ ధనాధన్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. శ్రీలంక (Sri lanka) వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ టి20 టోర్నీ జరగనుంది. ఈ మేరకు శనివారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనను విడుదల చేసింది. 1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 పర్యాయాలు ఈ ఆసియా కప్ జరిగింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి టోర్నమెంట్ ను నిర్వహిస్తోండగా... కరోనా వల్ల 2020లో టోర్నీ జరగలేదు. 2021లో జరపాలని తొలుత భావించినా అది సాధ్యపడలేదు.
తాజాగా 2022లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భారత్ (India) ఈ టోర్నీలో ఏడు సార్లు విజేతగా నిలిచి అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ ను గెలిచిన జట్టుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఐదు టైటిల్స్ తో ఉంది.
ప్రధాన టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుండగా... టోర్నీ క్వాలిఫయర్స్ మాత్రం ఆగస్టు 20 నుంచి జరుగుతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు శనివారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ జనరల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్ కు బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా హాజరయ్యారు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు లనుంచి సభ్యులు పాల్గొన్నారు. అదే సమయంలో ఏసీసీ ప్రెసిడెంట్ గా జై షా టర్మ్ ను మరో ఏడాది పాటు పొడిగించారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.