హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli Century : క్రికెట్ లో విరాట పర్వం మళ్లీ మొదలు.. సెంచరీతో కింగ్ ఈజ్ బ్యాక్.. అఫ్గాన్ టార్గెట్ ఎంతంటే?

Virat Kohli Century : క్రికెట్ లో విరాట పర్వం మళ్లీ మొదలు.. సెంచరీతో కింగ్ ఈజ్ బ్యాక్.. అఫ్గాన్ టార్గెట్ ఎంతంటే?

PC : Virat Kohli

PC : Virat Kohli

Asia Cup 2022 - Virat Kohli Century : విరాట్ కోహ్లీ (Virat Kohli) పనైపోయింది. అతడిని టీంలో ఎందుకు ఉంచుతున్నారు? కోహ్లీ వల్ల ట్యాలెంట్ ఉన్న ప్లేయర్లు ఎందరో బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది.. ఇలా ఎన్నో విమర్శలు కోహ్లీని ఉక్కిరి బిక్కిరి చేశాయి.

ఇంకా చదవండి ...
  • Advertorial
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - Virat Kohli Century : విరాట్ కోహ్లీ (Virat Kohli) పనైపోయింది. అతడిని టీంలో ఎందుకు ఉంచుతున్నారు? కోహ్లీ వల్ల ట్యాలెంట్ ఉన్న ప్లేయర్లు ఎందరో బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది.. ఇలా ఎన్నో విమర్శలు కోహ్లీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అయితే వారందరికీ ఆసియా కప్ (Asia cup) 2022 ద్వారా కోహ్లీ సమాదానం చెప్పాడు. నెల రోజుల విరామం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టిన కోహ్లీ.. ఒక్క శ్రీలంక (Sri Lanka)తో జరిగిన మ్యాచ్ తో మినహా ప్రతి మ్యాచ్ లోనూ అదరగొట్టాడు. ఇక అఫ్గానిస్తాన్ (Afghanistan)తో జరిగిన మ్యాచ్ లో అయితే సెంచరీతో చెలరేగిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1020 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెంచరీ అందుకున్నాడు. కోహ్లీ (61 బంతుల్లో 122; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (62) అర్ధ సెంచరీతో రాణించాడు.కీలకమైన టాస్ ను భారత్ మరోసారి ఓడింది. అయితే రోహిత్, చహల్, హార్దిక్ లకు విశ్రాంతి ఇచ్చిన టీమిండియా వారి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ లకు చోటు ఇచ్చింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన కోహ్లీ.. కేఎల్ రాహుల్ తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. వీరిద్దరూ అదిరిపోయే షాట్లతో రెచ్చిపోయారు. మధ్యలో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ దగ్గర అఫ్గానిస్తాన్ ప్లేయర్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చకున్న కోహ్లీ ఆ తర్వాత మరింత దూకుడుగా  ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 119 పరుగులు జోడించారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ పెవిలియన్ కు చేరుకున్నాడు. తొలి బంతినే సిక్సర్ బాదిన సూర్యకుమార్ యాదవ్ (6) ఆ తర్వాతి బంతికే పెవిలియన్ కు చేరుకున్నాడు.


ఇక ఇక్కడి నుంచి కోహ్లీ మరింత వేగంగా ఆడాడు. దొరికిన బంతిని క్లీన్ హిట్స్ తో బౌండరీ దాటించాడు. చూస్తుండగానే 70, 80 మార్క్ ను దాటుతూ 90ల్లోకి చేరుకున్నాడు. 94 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ... భారీ సిక్సర్ బాది సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి సారిగా కోహ్లీ 2019 నవంబర్ 23న బంగ్లాదేశ్ పై బాదాడు. సరిగ్గా 1020 రోజుల తర్వాత మళ్లీ సెంచరీని కోహ్లీ అందుకోవడం విశేషం. టి20ల్లో కోహ్లీకి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Dinesh Karthik, KL Rahul, Rashid Khan, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు