హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : ధోనికి పంత్ కు ఉన్న తేడా ఇదే.. కలలో కూడా మిస్టర్ కూల్ తో కంపేర్ చేసుకోకు..

Asia Cup 2022 : ధోనికి పంత్ కు ఉన్న తేడా ఇదే.. కలలో కూడా మిస్టర్ కూల్ తో కంపేర్ చేసుకోకు..

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia Cup) 2022లో భారత్ (India)కు మరో ఓటమి ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ గా 8వ టైటిల్ నెగ్గాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన టీమిండియా (Team India) వరుస పరాజయాలతో ఫైనల్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. అధికారికంగా ఫైనల్ చేరేందుకు భారత్ కు ఇంకా ఛాన్స్ ఉన్నా.. వేరే జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిన పరిస్థితి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia Cup) 2022లో భారత్ (India)కు మరో ఓటమి ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ గా 8వ టైటిల్ నెగ్గాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన టీమిండియా (Team India) వరుస పరాజయాలతో ఫైనల్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. అధికారికంగా ఫైనల్ చేరేందుకు భారత్ కు ఇంకా ఛాన్స్ ఉన్నా.. వేరే జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిన పరిస్థితి. సూపర్ 4లో భాగంగా శ్రీలంక ()తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్ (Rishabh Pant) మరోసారి దారుణంగా విఫలం అయ్యాడు. అటు బ్యాట్ తోను ఇటు వికెట్ల వెనుక దారుణ ప్రదర్శన చేశాడు. ధోని వారసుడిగా టీమిండియాలోకి వచ్చిన పంత్.. ఆ ట్యాగ్ ను నిలబెట్టుకోలేకపోతున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక విజయానికి చివరి ఓవర్లో 7 పరుగులు కావాలి. తొలి నాలుగు బంతులకు అర్ష్ దీప్ సింగ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐదో బంతిని వేయగా షనక ఆడలేకపోయాడు. అయినప్పటికీ రన్ కోసం ప్రయత్నించాడు. బంతిని అందుకున్న పంత్ వికెట్లను హిట్ చేయలేకపోయాడు. వికెట్ల వద్దకు రన్నింగ్ చేసుకుంటూ వచ్చి హిట్ చేసే అవకాశం ఉన్నా పంత్ మాత్రం దూరం నుంచే కొట్టే ప్రయత్నం చేశాడు. ఇదే అతడికి ఇంకా అనుభవం రాలేదని గుర్తు చేస్తుంది. 2016 భారత్ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లోనూ ఇలాంటి పరిస్థితే భారత్ కు ఎదురవుతుంది. అప్పుడు ధోని వికెట్ల వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి హిట్ చేసి భారత్ కు అపూరప విజయాన్ని అందిస్తాడు.

బంగ్లాదేశ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ విజయం కోసం చివరి బంతికి 2 పరుగులు చేయాలి. బంతిని కొట్టడంలో బ్యాటర్ విఫలం కాగా.. బాల్ నేరుగా ధోని చేతుల్లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్ ఫీల్డర్లు పరుగు కోసం ప్రయత్నించగా.. ధోని వికెట్ల వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి హిట్ చేస్తాడు. దాంతో భారత్ పరుగు తేడాతో విజయం సాధిస్తుంది. దూరం నుంచే ధోని వికెట్లను షూట్ చేయొచ్చు.. కానీ, ధోని ఆ అవకాశం తీసుకోడు. వికెట్ల వద్దకు చేరుకుని హిట్ చేస్తాడు. ఇక్కడే ధోని అనుభవం మనకు కనిపిస్తుంది. ఇక పంత్ అలా చేయడు. అదే సమయంలో షనకను స్టంపౌట్ చేసే అవకాశాన్ని కూడా పంత్ మిస్ చేస్తాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, India vs srilanka, MS Dhoni, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు