Home /News /sports /

ASIA CUP 2022 TEAM INDIA BOWLER UMESH YADAV BECOME HIGHEST WICKET TAKER IN ROYAL LONDON ONE DAY CRICKET TOURNEY SJN

Asia Cup 2022 : పనికిరాడని పక్కన పెట్టిన చోటే చెలరేగుతున్న టీమిండియా బౌలర్.. ఏకంగా 15 వికెట్లతో..

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : ఈ ఏడాది జూలై నెలలో భారత్ (India) ఇంగ్లండ్ (England)లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా గతేడాది టెస్టు సిరీస్ లో వాయిదా పడ్డ చివరి టెస్టు మ్యాచ్ తో పాటు టి20, వన్డే సిరీస్ లను ఆడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Asia Cup 2022 : ఈ ఏడాది జూలై నెలలో భారత్ (India) ఇంగ్లండ్ (England)లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా గతేడాది టెస్టు సిరీస్ లో వాయిదా పడ్డ చివరి టెస్టు మ్యాచ్ తో పాటు టి20, వన్డే సిరీస్ లను ఆడింది. టెస్టు మ్యాచ్ ను డ్రాాగా ముగిస్తే చాాలు ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో టీమిండియా (Team India) సొంతం చేసుకుంటుంది. అయితే ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం గమనార్హం. ఆ మ్యాచ్ కోసం భారత్ ఎంపిక చేసిన జట్టులో ఉమేశ్ యాదవ్ (Umesh Yadav)ను తీసుకోలేదు. అంతకుమందే జరిగిన ఐపీఎల్ (IPL) ఉమేశ్ యాదవ్ కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉమేశ్ యాదవ్ ప్రస్తుతం టెస్టు టీంలో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు.

బుమ్రా, షమీ, సిరాజ్ ఉండటంతో ఉమేశ్ యాదవ్ ను ఆ టెస్టు మ్యాచ్ కోసం పక్కన పెట్టింది. అయితే ప్రస్తుతం ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న రాయల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో చెలరేగుతున్నాడు. తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ఉమేశ్ యాదవ్ మిడిలెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు రాయల్ లండన్ కప్‌లో మిడిలెక్స్ తరపున మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన అతడు ఏకంగా 15 వికెట్లు తీసి టోర్నీ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు.



ఈ 5 మ్యాచ్‌ల్లో ఉమేష్ 46.4 ఓవర్లు వేసి 17.13 సగటుతో 257 పరుగులిచ్చాడు. అంతేకాకుండా 15 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు కూడా 6లోపే ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో ఒకసారి ఐదు వికెట్లు తీసిన ఘనత కూడా సాధించాడు. ప్రతి 19 బంతులకు ఒక వికెట్ తీస్తూ వస్తున్నాడు. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన 33 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడం. ఈ ఐదు మ్యాచ్ ల్లో ఉమేశ్ వల్ల మిడిలెక్స్ నాలుగు సార్లు విజయం సాధించడం విశేషం. ఆదివారం సోమర్ సెట్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఉమేశ్ యాదవ్ మెరిశాడు. 10 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో మిడిలెక్స్ వికెట్ తేడాతో విజయం సాధించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, England, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Rohit sharma, Sanju Samson, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు