హోమ్ /వార్తలు /క్రీడలు /

India Vs Pakistan: ఇండియా, పాకిస్తాన్‌ మధ్య మళ్లీ యుద్ధం.. రేపే మరో హైవోల్టేజ్ మ్యాచ్

India Vs Pakistan: ఇండియా, పాకిస్తాన్‌ మధ్య మళ్లీ యుద్ధం.. రేపే మరో హైవోల్టేజ్ మ్యాచ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Asia Cup: గ్రూప్-ఏలో రెండు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ జట్టు ఒక విజయంతో రెండో స్థానంలో ఉంది. ఇక గ్రూప్-బీలో ఆప్ఘానిస్తాన్ జట్టు రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  (Asia Cup)లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్ దశలో చివరిగా జరిగిన నిన్నటి మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌ (Hong kong)పై పాకిస్తాన్ (Pakistan) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత సూపర్-4 షెడ్యూల్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచే సూపర్-4 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. ఇప్పుడు సూపర్-4లో మొత్తం నాలుగు జట్లు ఉన్నాయి. అవి ఇండియా (India), పాకిస్తాన్ (Pakistan), శ్రీలంక (Srilanka), ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan). ఈ నాలుగు టీమ్‌లోని ప్రతి జట్టు కూడా...మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ లెక్కన ఇండియా టీమ్.. శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌తో కూడా మ్యాచ ఆడనుంది. అంటే.. దాయాదుల క్రికెట్ సమరం మళ్లీ ఉండబోతుందన్నమాట. అది కూడా ఎప్పుడో కాదు... రేపే (ఆదివారం) ఇండియా, పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.


  గ్రూప్-ఏలో రెండు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ జట్టు ఒక విజయంతో రెండో స్థానంలో ఉంది. ఇక గ్రూప్-బీలో ఆప్ఘానిస్తాన్ జట్టు రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఒక విజయంతో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. సూపర్-4లో భాగంగా... భారత జట్టు ఈ నెల4 మరోసారి పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 6న శ్రీలంక జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 8న అష్ఘానిస్తాన్‌ను ఢీకొడుతుంది. ఈ మూడు మ్యాచులు కూడా దుబయ్ వేదికగానే జరుగుతాయి.

  స్లో పిచ్ లకు సరైన మొగుడు.. బరిలోకి దిగితే బాక్సులు బద్దలవ్వాల్సిందే.!

  సూపర్ -4 షెడ్యూల్ :

  సెప్టెంబర్ 3 : శ్రీలంక Vs అఫ్ఘానిస్తాన్ - షార్జా

  సెప్టెంబర్ 4 : ఇండియా Vs పాకిస్తాన్ - దుబయ్

  సెప్టెంబర్ 6 : ఇండియా Vs శ్రీలంక - దుబయ్

  సెప్టెంబర్ 7 : పాకిస్తాన్ Vs అఫ్ఘానిస్తాన్- షార్జా

  సెప్టెంబర్ 8 : ఇండియా Vs అఫ్ఘానిస్తాన్ - దుబయ్

  సెప్టెంబర్ 9 : శ్రీలంక Vs పాకిస్తాన్ - దుబయ్

  సూపర్-4 మ్యాచ్‌లు సెప్టెంబరు 9న ముగుస్తాయి. టాప్-2గా నిలిచిన రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఆసియా కప్-2022 మ్యాచ్ సెప్టెంబరు 11న జరుగుతుంది. ప్రస్తు ఫామ్ ప్రకారం.. ఇండియా, పాకిస్తాన్ జట్లే ఫైనల్‌లో తలపడతాయని అందరూ భావించారు. కానీ గ్రూప్-బీలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ టీమ్ అంచనాలకు మించి అదరగొట్టింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి.. టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇదే దూకుడను ఆఫ్ఘానిస్తాన్ కొనసాగిస్తే.. ఫైనల్‌ మ్యాచ్ ఇండియా, పాకిస్తాన్ మధ్య కాకుండా.. ఇండియా, ఆఫ్ఘానస్తాన్ మధ్య జరిగే అవకాశముందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఇదే అంచనాతో ఉన్నారు. మరి ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతుందన్నది.. సెప్టెంబరు 9నే తెలుస్తుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Asia Cup 2022, Cricket, IND vs PAK, India pakistan

  ఉత్తమ కథలు