Home /News /sports /

ASIA CUP 2022 SCHEDULE STAR SPORTS RELEASES ASIA CUP PROMO ON TEAM INDIA SJN

Asia Cup 2022 : ఆసియా కప్ పై బిగ్ అప్ డేట్.. టీమిండియాపై ప్రోమోతో పాటు తేదీలను చెప్పిన స్టార్ స్పోర్ట్స్

PC L TWITTER

PC L TWITTER

Asia Cup 2022 : ఆగస్టు నెలలో క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు మరో టోర్నీ సిద్దమైంది. టి20 ఫార్మాట్ లో జరిగే ఆసియాకప్ (Asia Cup) మనముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి టీమిండియా (Team India)పై ఒక ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసింది.

ఇంకా చదవండి ...
Asia Cup 2022 : ఆగస్టు నెలలో క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు మరో టోర్నీ సిద్దమైంది. టి20 ఫార్మాట్ లో జరిగే ఆసియాకప్ (Asia Cup) మనముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి టీమిండియా (Team India)పై ఒక ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లతో పాటు మరో క్వాలిఫయర్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొననుంది. ఆరో బెర్త్‌ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్‌లో తలపడనున్నాయి.

ఇది కూడా చదవండి  : టీమిండియా గెలుపుకు ముఖ్య కారణం అతడే.. డైవ్ చేసి ఉండకపోయింటే అంతే సంగతులు..

వాస్తవానికి 2020లోనే శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వల్ల 2022కి వాయిదా పడింది. అయితే తమ దేశంలోతలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల తాము ఆసియా కప్ ను నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దాంతో ఆసియా కప్ ను యూఏఈకి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. తాజాగా టోర్నీకి సంబంధించిన ప్రోమోను ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ వేదికగా విడుదల చేస్తూ.. ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 45 సెకెన్ల పాటు సాగిన ఈ ప్రోమోలో అత్యధిక భాగం భారత ఆటగాళ్లు దర్శనమివ్వగా.. పాక్‌ నుంచి బాబర్‌ ఆజమ్‌, షాహిన్‌ అఫ్రిది, బంగ్లాదేశ్‌ నుంచి షకీబ్‌ అల్‌ హసన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున రషీద్‌ ఖాన్‌ కనిపించారు.



డిఫెండింగ్ చాంపియన్ గా ఇండియా

ఆసియా కప్ లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఆసియా కప్ ఇప్పటి వరకు 14 సార్లు జరగ్గా.. అందులో భారత్ ఏకంగా 7 సార్లు చాంపియన్ గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక అత్యధికంగా 5 సార్లు ఆసియా చాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ 2 సార్లు మాత్రమే చాంపియన్ గా నిలువడం గమనార్హం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia cup 2018, Bcci, India Vs Westindies, Ravindra Jadeja, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు