హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : ఇందుకే జడేజాను జట్టులో ఉండాలనేది.. నిజమైన 3D ప్లేయర్.. రనౌట్ ఒకసారి చూసేయండి

Asia Cup 2022 : ఇందుకే జడేజాను జట్టులో ఉండాలనేది.. నిజమైన 3D ప్లేయర్.. రనౌట్ ఒకసారి చూసేయండి

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia cup) 2022లో భారత్ (India) సూపర్ 4 దశకు చేరుకుంది. దుబాయ్ (Dubai) వేదికగా బుధవారం జరిగిన పోరులో పసికూన హాంకాంగ్ (Hong Kong)పై టీమిండియా (Team india) 40 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బ్యాట్ తో మెరిస్తే.. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్, బౌలింగ్ లో అదరగొట్టాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia cup) 2022లో భారత్ (India) సూపర్ 4 దశకు చేరుకుంది. దుబాయ్ (Dubai) వేదికగా బుధవారం జరిగిన పోరులో పసికూన హాంకాంగ్ (Hong Kong)పై టీమిండియా (Team india) 40 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బ్యాట్ తో మెరిస్తే.. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్, బౌలింగ్ లో అదరగొట్టాడు. ఇక హాంకాంగ్ కెప్టెన్ నిజాఖత్ ఖాన్ రనౌట్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. జడేజా కాకుండా అక్కడ వేరే ప్లేయర్ ఉంటే భారత్ కు వికెట్ వచ్చింది కాదు. కేవలం జడేజా ప్యూర్ ఎబిలిటీ వల్లే భారత్ కు రనౌట్ రూపంలో వికెట్ వచ్చింది. ఆల్ రౌండర్ కు 3డీ ప్లేయర్ అనే ట్యాగ్ ను భారత మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది జడేజాకు సరిగ్గా సరిపోతుంది.హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో ఐదో బంతిని ఆర్ష్‌దీప్‌ సింగ్‌ సింగ్‌ నో బాల్‌గా వేశాడు. దీంతో ప్రత్యర్ధి బ్యాటర్‌కు ఫ్రీ హిట్‌ లభించింది. అయితే ఈ ఫ్రీ హిట్‌ను హాంకాంగ్‌ ఉపయోగించుకోకపోవడమే కాకుండా కీలక వికెట్‌ను కూడా కోల్పోయింది. ఈ బంతిని ఎదుర్కొన్న హాంకాంగ్‌ కెప్టెన్‌ నిజాఖత్ ఖాన్‌ పాయింట్‌ దిశగా షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. జడేజా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్నాడు. బంతి అతడి సమీపంలో పడి వన్ బౌన్స్ తో చేతుల్లోకి వెళ్లింది. నిజాఖత్ పరుగు కోసం క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న బాబర్ వెనక్కి వెళ్లాలని చెప్పాడు. క్రీజుకు దగ్గరలోనే ఉండటంతో నిజాఖత్ ఈజీగా చేరుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే జడేజా మెరుపు వేగంతో వికెట్లను గురి చూసి కొట్టాడు. టీవీ రీప్లేలో చూస్తే రనౌట్ గా తేలింది. ఊహించని విధంగా ఫ్రీ హిట్ కు నిజాఖత్ రనౌట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 59 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో  రాణించాడు. వీరిద్దరూ అజేయమైన మూడో వికెట్ 98 పరుగులు జోడించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసింది. బాబర్ హయత్ (41), కించిత్ షా (30) ఫర్వాలేదనిపించారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Hardik Pandya, Hong kong, KL Rahul, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు