హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : నసీం షా సిక్సర్లు కొట్టిన బ్యాట్ కథ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.. గల్లీ క్రికెట్ స్టయిల్ లో..

Asia Cup 2022 : నసీం షా సిక్సర్లు కొట్టిన బ్యాట్ కథ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.. గల్లీ క్రికెట్ స్టయిల్ లో..

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా బుధవారం రాత్రి అఫ్గానిస్తాన్ (Afghanistan), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా బుధవారం రాత్రి అఫ్గానిస్తాన్ (Afghanistan), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ వికెట్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ లో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. తక్కువ లక్ష్యంతో ఛేదనకు దిగిన పాకిస్తాన్ ను అఫ్గాన్ బౌలర్లు నిలువరించారు. అయితే షాదబ్ ఖాన్ (26 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్ విజయం వైపు నడిచింది. అయితే చివర్లో అఫ్గాన్ బౌలర్లు చెలరేగడంతో 19వ ఓవర్ ముగిసే సమయానికి పాక్ 9 వికెట్లకు 119 పరుగులు చేసింది.ఇది కూడా చదవండి  : ఈ ముగ్గురు ప్లేయర్లు జట్టులో ఉంటే టి20 ప్రపంచకప్ ఈసారి కూడా గోవిందా.. గోవిందా..
క్రీజులో నసీం షా, హస్నైన్ అలీ ఉన్నారు. వీరిద్దరూ బౌలర్లు కావడం.. అంతకుముందు తన ఓవర్లో ఫరూఖీ రెండు వికెట్లు తీయడంతో అఫ్గానిస్తాన్ విజయం ఖాయంలా అనిపించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నసీం షా వరుసగా రెండు సిక్సర్లు బాది పాకిస్తాన్ కు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో నసీం షా ఉపయోగించిన బ్యాట్ అతడిది కాదట. ఈ విషయాన్ని నసీమే మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. చివరి ఓవర్ ఆరంభానికంటే ముందు హస్నైన్ దగ్గరకు వెళ్లి బ్యాట్ ను మార్చుకున్నట్లు తెలిపాడు. మనం ఆడే గల్లి క్రికెట్ లో కూడా స్ట్రయికింగ్ ఎండ్ లోకి రాను నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న వ్యక్తితో బ్యాట్ ను మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. నసీం కూడా అలానే చేశాడు. ప్రాక్టీస్ లో అతడి బ్యాట్ పాడైపోవడంతో కీలక ఓవర్లో హస్నైన్ బ్యాట్ తీసుకున్నట్లు తెలిపాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత హస్నైన్ కూడా మాట్లాడుతూ ’20వ ఓవర్ ఆరంభానికి ముందు నసీం నా దగ్గరకు వచ్చి బ్యాట్ అడిగాడు. సింగిల్ తీస్తే బ్యాట్ తిరిగి ఇవ్వాలని చెప్పా. అయితే ఆ అవకాశం ఇవ్వకుండా సిక్సర్లతో మ్యాచ్ ను ముగించేశాడు’అని పేర్కొన్నాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Babar Azam, Pakistan, Rashid Khan, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు