హోమ్ /వార్తలు /క్రీడలు /

Rashid khan : రషీద్ ఖాన్ ఇగో హర్ట్ అయితే ఇలానే ఉంటుంది.. ఫోర్ కొట్టగానే ఏం చేశాడో మీరే చూడండి

Rashid khan : రషీద్ ఖాన్ ఇగో హర్ట్ అయితే ఇలానే ఉంటుంది.. ఫోర్ కొట్టగానే ఏం చేశాడో మీరే చూడండి

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 Live Score : మైదానంలో ఎప్పుడూ కూల్ గా కనిపించే అఫ్గానిస్తాన్ (Afghanistan) స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khan) ఆగ్రహానికి గురయ్యాడు. ప్రత్యర్థి ప్లేయర్లతో కూడా నవ్వుతూ కనిపించే అతడు మాటల యుద్ధానికి దిగాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 Live Score : మైదానంలో ఎప్పుడూ కూల్ గా కనిపించే అఫ్గానిస్తాన్ (Afghanistan) స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khan) ఆగ్రహానికి గురయ్యాడు. ప్రత్యర్థి ప్లేయర్లతో కూడా నవ్వుతూ కనిపించే అతడు మాటల యుద్ధానికి దిగాడు. ఆసియా కప్ (Asia cup 2022) 2022లో భాగంగా శనివారం అఫ్గానిస్తాన్, శ్రీలంక (Sri Lanka) జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగింది. 176 పరుగుల లక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్ కు దిగగా.. అఫ్గాన్ బౌలర్లు తేలిపోయారు. ప్రత్యర్థిని స్పిన్ బౌలింగ్ తో కట్టడి చేసిన అఫ్గానిస్తాన్ టీం ఈసారి మాత్రం ఆ పని చేయలేకపోయింది. ఇక టి20ల్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఉన్న రషీద్ ఖాన్ కూడా ఈసారి ఏం చేయలేకపోయాడు. తొలి 3 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చిన రషీద్.. 17వ ఓవర్ వేయడానికి వచ్చాడు. అయితే తొలి బంతినే  దనుష్క గుణతిలక రివర్స్ స్వీప్ లో బౌండరీ బాదాడు. అంతే ఆవేశంతో ఊగిపోయిన రషీద్‌.. గుణతిలకతో గొడవకు దిగాడు. గుణతిలకపై పరుష పదజాలంతో రషీద్ విరుచుకుపడ్డాడు.

అదే సమయంలో తానేమి తక్కువ తినలేదు అన్నట్లు గుణతిలక కూడా రషీద్ ను ఏదో అన్నాడు. దాంతో మరింత రెచ్చిపోయిన రషీద్ గుణతిలక వైపు దూసుకెళ్లాడు. అయితే అక్కడే ఉన్న మరో శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స ఇద్దరికి నచ్చజెప్పాడు. అనంతరం గుణతిలక రషీత్ చేతులు కలిపి ఏం జరగలేదు అన్నట్లు వెళ్లిపోయారు. ఇక ఆ ఓవర్ నాలుగో బంతికి గుణతిలకను అవుట్ చేసిన రషీద్ ఫోర్ కొట్టినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే టోర్నీల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న అఫ్గానిస్తాన్ కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్లు తలపడగా అప్పుడు శ్రీలంకపై అఫ్గాన్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం భారీ స్కోరు చేసిన డ్యూ ఫ్యాక్టర్ చెత్త ఫీల్డింగ్ తో అఫ్గానిస్తాన్ టీం ఓటమిని కొని తెచ్చుకుంది. ఫలితంగా శ్రీలంక 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్  రహ్మనుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 84 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. జద్రాన్ (40)  రాణించాడు. ఒక దశలో అఫ్గానిస్తాన్ 200 మార్కును చేరుకునేట్లు కనిపించింది. అయితే చివరి వరుస బ్యాటర్లు విఫలం అవ్వడంతో ఆ మార్కును అందుకోలేకపోయింది.

ఇది కూడా చదవండి  : ఆ మూడు స్థానాల్లో ఎవర్ని ఆడించాలో తెలియక తికమక పడుతోన్న మాస్టర్ మైండ్ ద్రవిడ్.. పాక్ తో మ్యాచ్ లో ఏం చేస్తాడో మరి?

అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన 179 పరుగులు చేసి నెగ్గింది. ఈ విజయంతో గ్రూప్ దశలో అఫ్గానిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కుశాల్ మెండీస్ (36), నిస్సంక (35), గుణతిలక (33), భానుక రాజపక్స (31) తలా ఓ చెయ్యి వేసి జట్టును గెలిపించారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, KL Rahul, Rashid Khan, Rishabh Pant, Rohit sharma, Sri Lanka, Virat kohli

ఉత్తమ కథలు