హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : కోహ్లీ కిరాక్ ఇన్నింగ్స్.. టీమిండియా భారీ స్కోరు.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే?

IND vs PAK : కోహ్లీ కిరాక్ ఇన్నింగ్స్.. టీమిండియా భారీ స్కోరు.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs PAK : ఆసియా కప్ (Asia Cup) 2022లో విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో అర్ధ సెంచరీని సాధించాడు. దుబాయ్ వేదికగా సూపర్ 4లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరుగుతోన్న మ్యాచ్ లో భారత్ (India) భారీ స్కోరును అందుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs PAK : ఆసియా కప్ (Asia Cup) 2022లో విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో అర్ధ సెంచరీని సాధించాడు. దుబాయ్ వేదికగా సూపర్ 4లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరుగుతోన్న మ్యాచ్ లో భారత్ (India) భారీ స్కోరును అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాక్ టు బ్యాక్ అర్ధ సెంచరీలు సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాదబ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.

ఓపెనర్లు శుభారంభం

టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు గత మ్యాచ్ లలో కాకుండా ఈ మ్యాచ్ లో భారత్ కు శుభారంభం చేశారు. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ధనాధన్ షాట్లతో అదరగొట్టాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 54 పరుగులు జోడించారు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ శర్మ రావూఫ్ బౌలింగ్ లో కుష్దిల్ పట్టిన అద్బుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ కూడా పెవిలియన్ కు చేరాడు.

కోహ్లీ వన్ మ్యాన్ షో

వెంట వెంటనే వికెట్లు పడ్డా క్రీజులో ఉన్న కోహ్లీ మాత్రం తన ఫామ్ ను కొనసాగించాడు. కమ్ బ్యాక్ లో కోహ్లీ అదరగొడుతున్నాడు. గత మ్యాచ్ లో అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ.. ఈ మ్యాచ్ లో ఆ ఫామ్ ను కొనసాంచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ (13) హాంకాంగ్ పై ఆడినట్లు ఈ మ్యాచ్ లో ఆడలేకపోయాడు. ఇక రిషభ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (0) విఫలం అయ్యారు. చివర్లో దీపక్ హుడా కూడా ధాటిగా ఆడటంలో సక్సెస్ కాలేకపోయాడు. మరో ఎండ్ లో ఉన్న కోహ్లీ మాత్రం సిక్సర్ తో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బ్యాటర్లు లేకపోవడంతో చివరి ఓవర్లో కోహ్లీనే స్ట్రయిక్ లో ఉండేందుకు ప్రయత్నించాడు. దాంతో 20వ ఓవర్ తొలి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా రాలేదు. అయితే నాలుగో బంతికి రెండో పరుగు చేసే క్రమంలో కోహ్లీ రనౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో భారత్ 180 మార్కును దాటగలిగింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు