హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Pakistan : టాస్ ఓడిన భారత్.. దినేశ్ కార్తీక్ అవుట్ దీపక్ హుడా విన్.. తుది జట్లు ఇవే

India vs Pakistan : టాస్ ఓడిన భారత్.. దినేశ్ కార్తీక్ అవుట్ దీపక్ హుడా విన్.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - India vs Pakistan : ఆసియా కప్ (Asia cup) 2022 మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు వేదిక కానుంది. దుబాయ్ (Dubai) వేదికగా భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు మరోసారి తలపడనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - India vs Pakistan : ఆసియా కప్ (Asia cup) 2022 మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు వేదిక కానుంది. దుబాయ్ (Dubai) వేదికగా భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు మరోసారి తలపడనున్నాయి. సూపర్ 4లో భాగంగా మరికొద్దిసేపట్లో ఆరంభమయ్యే ఈ పోరులో టాస్ నెగ్గిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్  ఆజం ఫీల్డింగ్ ఎంచకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. అవేశ్ ఖాన్ పై వేటు వేయగా.. రవీంద్ర జడేజా గాయంతో తప్పుకున్నాడు. అదే సమయంలో దినేశ్ కార్తీక్ ను తప్పించింది. వీరి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్, దీపక్ హుడాలను తీసుకుంది. పాకిస్తాన్ కూాడా ఒక మార్పు చేసింది. గాయంతో దహాని తప్పుకోగా అతడి స్థానంలో హసన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు.

ఇది కూడా చదవండి : భారత్ ను టెన్షన్ పెడుతోన్న ఆ నాలుగు.. ఈసారి విజయం అంత ఈజీ కాదు

రాహుల్ కు మరో అవకాశం

భారత్  ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేసింది. అవేశ్ ఖాన్, దినేశ్ కార్తీక్, గాయపడ్డ జడేజాలను తప్పించి వారి స్థానాల్లో దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ లను తీసుకుంది. అయితే గత మ్యాచ్ ల్లో విఫలం అయిన కేఎల్ రాహుల్ కు మాత్రం మరో అవకాశం ఇచ్చింది. అయితే రవింద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ను కాదని రవి బిష్ణోయ్ ని తీసుకోవడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. మరోవైపు గాయపడ్డ దహాని స్థానంలో హసన్ అలీని తుది జట్టులోకి తీసుకుంది.


తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్

పాకిస్తాన్

బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, హసన్ అలీ, హరీస్ రావూఫ్, నసీం షా

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Axar Patel, Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు