హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : ఏకంగా రోహిత్ శర్మ రికార్డునే బద్దలు కొట్టిన అఫ్గాన్ చిచ్చర పిడుగు.. ఎందులో అంటే?

Asia Cup 2022 : ఏకంగా రోహిత్ శర్మ రికార్డునే బద్దలు కొట్టిన అఫ్గాన్ చిచ్చర పిడుగు.. ఎందులో అంటే?

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : Asia Cup 2022 : ఆసియా కప్ (Asia cup 2022) 2022 సూపర్ 4లో భాగంగా శనివారం శ్రీలంక (Sri Lanka), అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia cup 2022) 2022 సూపర్ 4లో భాగంగా శనివారం శ్రీలంక (Sri Lanka), అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ పై విజయం సాధించింది. దాంతో గ్రూప్ దశలో అఫ్గానిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుర్బాజ్ ఏకంగా రోహిత్ శర్మ రికార్డునే బద్దలు కొట్టాడు. నిన్నటి వరకు కూడా ఆసియా కప్ (టి20 ఫార్మాట్ లో)లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట రికార్డు ఉండేది.

2016 ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 55 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఆసియా కప్ టి20 ఫార్మాట్ లో నిన్నటి వరకుఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 84 పరుగులు చేయడం ద్వారా రోహిత్ రికార్డును గుర్బాజ్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో అఫ్గానిస్తాన్ తరఫున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్ గా కూడా గుర్బాజ్ రికార్డుకెక్కాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో గుర్బాజ్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీని అందుకున్నాడు.

ఇక ఈ టోర్నీలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న గుర్భాజ్‌.. 3 మ్యాచ్‌ల్లో 167 స్ట్రయిక్‌ రేట్‌తో 45 సగటున 135 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. శ్రీలంకపై తొలి మ్యాచ్‌లో 18 బంతుల్లో 40 పరుగులతో విధ్వంసం సృష్టించిన గుర్భాజ్‌.. ఆతర్వాత బంగ్లాదేశ్‌తో (11) జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు.  శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో గుర్బాజ్ రాణించినా మిగిలిన బ్యాటర్స్ విఫలం అవ్వడంతో అఫ్గాన్ కు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్  రహ్మనుల్లా గుర్బాజ్ కు తోడు జద్రాన్ (40)  రాణించాడు. ఒక దశలో అఫ్గానిస్తాన్ 200 మార్కును చేరుకునేట్లు కనిపించింది. అయితే చివరి వరుస బ్యాటర్లు విఫలం అవ్వడంతో ఆ మార్కును అందుకోలేకపోయింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన 179 పరుగులు చేసి నెగ్గింది. ఈ విజయంతో గ్రూప్ దశలో అఫ్గానిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కుశాల్ మెండీస్ (36), నిస్సంక (35), గుణతిలక (33), భానుక రాజపక్స (31) తలా ఓ చెయ్యి వేసి జట్టును గెలిపించారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Axar Patel, Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Rashid Khan, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు