హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL : సేమ్ స్క్రీన్ ప్లే.. సేమ్ రిజల్ట్.. మారింది ప్రత్యర్థి మాత్రమే.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఖేల్ ఖతం..

IND vs SL : సేమ్ స్క్రీన్ ప్లే.. సేమ్ రిజల్ట్.. మారింది ప్రత్యర్థి మాత్రమే.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఖేల్ ఖతం..

Pc : TWITTER

Pc : TWITTER

Asia Cup 2022 - IND vs SL : సేమ్ స్క్రీన్ ప్లే.. సేమ్ రిజల్ట్ ప్రత్యర్థి మాత్రమే మారింది. మరోసారి ఒత్తిడిలో భారత్ చిత్తయింది. పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లోలాగే ఈ మ్యాచ్ లోనూ భారత్ (India) గెలవాలంటే ఆఖరి ఓవర్లో 7 పరుగులను డిఫెండ్ చేసుకోవాలి. చివరి ఓవర్ ను అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh) వేయడానికి వచ్చాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs SL : సేమ్ స్క్రీన్ ప్లే.. సేమ్ రిజల్ట్ ప్రత్యర్థి మాత్రమే మారింది. మరోసారి ఒత్తిడిలో భారత్ చిత్తయింది. పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లోలాగే ఈ మ్యాచ్ లోనూ భారత్ (India) గెలవాలంటే ఆఖరి ఓవర్లో 7 పరుగులను డిఫెండ్ చేసుకోవాలి. చివరి ఓవర్ ను అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh) వేయడానికి వచ్చాడు. తొలి నాలుగు బంతులకు కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐదో బంతి వేయగా.. శ్రీలంక (Sri Lanka) కెప్టెన్ దసున్ షనక (Dasun Shanaka) ఆడలేకపోయాడు. బంతి కీపర్ చేతిలోకి వెళ్లింది. అయినా శ్రీలంక బ్యాటర్లు షనక, రాజపక్స పరుగు కోసం ప్రయత్నించారు. అటు పంత్ గానీ, ఇటు అర్ష్ దీప్ గానీ వికెట్లను గిరాటేయలేకపోయాడు. ఓవర్ త్రో రూపంలో మరో పరుగు పూర్తి చేసిన శ్రీలంక మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు నిసంక (37 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుశాల్ మెండీస్ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లను ఓ ఆట  ఆడుకున్నారు. వీరిద్దరు అర్ధ సెంచరీలతో చెలరేగడంతో శ్రీలంక ఛేదన సాఫీగా సాగిపోయింది. ఒక దశలో వీరు వికెట్ నష్టపోకుండానే లక్ష్యాన్ని చేరుకుంటుందేమో అనిపించింది. అయితే రివర్స్ స్వీప్ కు ప్రయత్నించిన రోహిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో 97 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక పడింది. ఫామ్ లో లేని అసలంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే గుణతిలక (1), కుశాల్ మెండీస్ లు కూడా పెవిలియన్ కు చేరారు. దాంతో 97/0గా ఉన్న శ్రీలంక.. 110/4గా నిలిచింది. ఇందులో మూడు వికెట్లను చహల్ తీసుకోవడం విశేషం.

13 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు తీయడంతో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన షనక (33 నాటౌట్), రాజపక్స (25 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. వీరు చహల్ బౌలింగ్ కు చూసి ఆడి.. ఆ తర్వాత చెలరేగిపోయారు. అదే సమయంలో 0 పరుగుల వద్ద చహల్ బౌలింగ్ లో షనక స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి భయపటపడ్డాడు. చహల్ వైడ్ గా బంతిని వేయగా.. షనక ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. దాంతో బంతి షనకను బీట్ చేస్తూ కీపర్ దగ్గరకు వెళ్లింది. అయితే పంత్ దానిని అందుకోవడంలో విఫలం అయ్యాడు. బతకిిపోయిన షనక జట్టుకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో చహల్ కు 3 వికెట్లు లభించగా.. రవిచంద్రన్ అశ్విన్ కు 1 వికెట్ పడింది. ః

అంతకుముందు భారత  కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. దాంతో దుబాయ్ (Dubai) వేదికగా సూపర్ 4లో భాగంగా శ్రీలంక (Sri Lanka)తో జరుగుతోన్న మ్యాచ్ లో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. రోహిత్ కు తోడుగా సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) ధాటిగా ఆడటంతో భారత్ మెరుగైన స్కోరును అందుకుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, India vs srilanka, KL Rahul, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు