హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : పాక్ చేతిలో ఓడినా.. టీమిండియాకు ఊరట ఇచ్చే అంశాలు ఇవే

Asia Cup 2022 : పాక్ చేతిలో ఓడినా.. టీమిండియాకు ఊరట ఇచ్చే అంశాలు ఇవే

Team India

Team India

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia Cup 2022) 2022లో భారత్ (India)కు తొలి పరాజయం ఎదురైంది. గ్రూప్ దశలో వరుసగా విజయాలు సాధించి టాపర్ హోదాతో సూపర్ 4కు టీమిండియా (Team India) అర్హత సాధించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia Cup 2022) 2022లో భారత్ (India)కు తొలి పరాజయం ఎదురైంది. గ్రూప్ దశలో వరుసగా విజయాలు సాధించి టాపర్ హోదాతో సూపర్ 4కు టీమిండియా (Team India) అర్హత సాధించింది. అయితే సూపర్ 4లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ ఓటమికి కారణాలు ఇవంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. మ్యాచ్ లో గెలుపోటములు సహజమే. ఈ మ్యాచ్ ద్వారా భారత్ బలహీనతలు బయటపడ్డాయి. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ లలో మెరుగవ్వాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ కు నెగెటివ్ అంశాలే కాదు పాజిటివ్ అంశాలు కూడా బయట పడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్లు

గత కొంత కాలంగా టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం చేయడం లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పూర్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ తమ బ్యాట్ కు పనిచెప్పారు. తొలి ఓవర్ నుంచే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధించారు. వీరిద్దరు చెరో 28 పరుగులే చేసి ఉండొచ్చు.. కానీ, ధనాధన్ ఓపెనింగ్ ఇచ్చారు. కేవలం 31 బంతుల్లోనే 54 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. టి20 ప్రపంచకప్ ముంగిట వీరిద్దరూ ఫామ్ లో ఉంటే భారత్ కు తిరుగుండదు.

కోహ్లీ నిలకడ

ఇంగ్లండ్ పర్యటన అనంతరం కోహ్లీ క్రికెట్ కు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. నెలరోజుల పాటు అతడు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఆసియా కప్ తో పునరాగమనం చేశాడు. గ్రూప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 35 పరుగులు చేసి టచ్ లో ఉన్నట్లు చెప్పాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ 0 పరుగుల వద్దే అవుటవ్వాల్సింది. కానీ, స్లిప్ లో ఫీల్డర్ క్యాచ్ ను జారవిడవడంతో బతికిపోయాడు. అయితే ఆ తర్వాత అతడు క్లీన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక హాంకాంగ్ పై అర్ధ శతకం సాధించిన అతడు.. సూపర్ 4 లో పాకిస్తాన్ పై కిరాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ లాంటి ప్లేయర్ ఫామ్ లో ఉంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే. టి20 ప్రపంచకప్ ముందర కోహ్లీ తన మునుపటి లయ అందుకోవడం భారత్ కు శుభ సూచకం.

బిష్ణోయ్ సూపర్ బౌలింగ్

ఆసియా కప్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నా రవి బిష్ణోయ్ అదరగొట్టాడు. సీనియర్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్న చోట బిష్ణోయ్ నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా ఒక వికెట్ తీసుకున్నాడు. అర్ష్ దీప్ సింగ్ క్యాచ్ పట్టి ఉంటే రెండో వికెట్ కూడా అతడి ఖాతాలో చేరేది. బిష్ణోయ్ తనను తాను నిరూపించుకోవడంతో భారత్ రిజర్వ్ బెంచ్ మరింత బలంగా కనిపిస్తోంది.

అర్ష్ దీప్ లాస్ట్ ఓవర్

చివరి ఓవర్లో పాకిస్తాన్ కేవలం 7 పరుగులు చేయాల్సి ఉన్న స్థితిలో బౌలింగ్ కు వచ్చిన అర్ష్ దీప్ చక్కటి ప్రదర్శన చేశాడు. క్యాచ్ డ్రాప్ విషయాన్ని పక్కన బెడితే బిష్ణోయ్ తర్వాత మంచి బౌలింగ్ ప్రదర్శన చేసింది అర్ష్ దీప్ సింగే. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా.. అనుభవం తక్కువగా ఉన్నా.. చివరి ఓవర్లో అర్ష్ దీప్ అద్బుతమైన నియంత్రణతో యార్కర్లు వేశాడు. ఒక వికెట్ కూడా తీశాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, India vs srilanka, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు