హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia cup 2022 : రోహిత్ శర్మకు చురకలు అంటించిన కోహ్లీ మాజీ కోచ్.. ఏమన్నాడంటే?

Asia cup 2022 : రోహిత్ శర్మకు చురకలు అంటించిన కోహ్లీ మాజీ కోచ్.. ఏమన్నాడంటే?

Rohit Sharma

Rohit Sharma

Asia cup 2022 - IND vs SL : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) మరికొద్ది సేపట్లో శ్రీలంక (Sri Lanka)తో డూ ఆర్ డై మ్యాచ్ కు రెడీ అవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia cup 2022 - IND vs SL : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) మరికొద్ది సేపట్లో శ్రీలంక (Sri Lanka)తో డూ ఆర్ డై మ్యాచ్ కు రెడీ అవుతుంది. సూపర్ 4లో భాగంగా జరిగే ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే ఫైనల్ రేసులో నిలుస్తుంది లేదంటే ఇక్కడితో ఆసియా కప్ కలకు ఎండ్ కార్డ్ పడుతుంది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ (Virat Kohli) చిన్ననాటి కోచ్  రాజ్‌కుమార్ శర్మ (Rajkumar Sharma) షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ విఫలం అయ్యాడంటూ కామెంట్స్ చేశాడు.

దీపక్ హుడాను జట్టులోకి తీసుకుందే ఆరో బౌలర్ రోల్ కోసం అన్న రాజ్ కుమార్.. అతడితో ఒక్క ఓవర్ కూడా ఎందుకు వేయించలేదో అర్థం కాలేదని పేర్కొన్నాడు. మొహమ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దీపక్ హుడాతో ఒకటి రెండు ఓవర్లు వేయించి ఉండాల్సిందని రాజ్ కుమార్ అభిప్రాయపడ్డాడు. అయితే రోహిత్ శర్మకు దీపక్ హుడాపై నమ్మకం లేనట్లు కనిపించిందన్నాడు. నమ్మకం లేనప్పుడు హుడాను తుది జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదంటూ రోహిత్ కు చురకలు అంటించాడు.

టీం సెలెక్షన్ సరిగ్గా లేదు

ఆసియా కప్ కోసం టీమిండియా సెలెక్షన్ సరిగ్గా లేదని రాజ్ కుమార్ వ్యాఖ్యానించాడు. టీంలో ముగ్గురు పేసర్లు మాత్రమే ఉండాలన్న టీమిండియా సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు. మరో పేసర్ ను భారత స్క్వాడ్ లోకి తీసుకోవాల్సిందని కామెంట్ చేశాడు. ఇద్దరు లెగ్ స్పిన్నర్లను ఆసియా కప్ కోసం ఎంపిక చేసే బదులు వారి స్థానాల్లో ఒక పేసర్ ను తీసుకుని ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

శ్రీలంకతో తాడో పేడో

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా విఫలం అయిన రిషభ్ పంత్, యుజువేంద్ర చహల్ లను పక్కన పెట్టే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కు కూడా అవకాశం లేకపోలేదు. అశ్విన్ ను తీసుకుంటే మాత్రం భారత బ్యాటింగ్ లో ఎడం చేతి బ్యాటర్ ఉండడు. దాంతో చహల్ స్థానంలో అశ్విన్ కంటే కూడా అక్షర్ పటేల్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇక ఓపెనర్లు రాహుల్, రోహిత్ లు ఫామ్ లోకి రావడం.. కోహ్లీ నిలకడ చూపిస్తుండటం భారత్ కు కలిసొచ్చే అంశాలు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, India vs srilanka, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు