IND vs SL - IND vs SL : ఆసియా కప్ (Asia cup) 2022లో భారత్ (India) కీలక మ్యాచ్ ఆడనుంది. మంగళవారం దుబాయ్ (Dubai) వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా (Team India) శ్రీలంక (Sri Lanka)తో డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్దమైంది. గత ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ (Pakistan) చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో భారత్ తప్పక నెగ్గాల్సిన పరిస్థిలో నిలిచింది. పేపర్ పై మాత్రం శ్రీలంక కంటే కూడా భారత్ బలంగా ఉంది. అయితే ఒక విషయం భారత్ ను భయపెడుతోంది. అదే శ్రీలంక సమష్టితత్వం. ఆసియా కప్ లో భాగంగా జరిగిన ఆరంభపోరులో అఫ్గానిస్తాన్ చేతిలో 105 పరుగులకే కుప్పకూలి భారీ ఓటమితో టోర్నీని శ్రీలంక ఆరంభించింది.
అయితే అనంతరం బంగ్లాదేశ్ తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్ లో విజయం సాధించి సూపర్ 4కు చేరుకుంది. ఇక మరోసారి సూపర్ 4లో అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ అదరగొట్టిన శ్రీలంక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. వరుసగా రెండు విజయాలు సాధించడంతో శ్రీలంక ఫుల్ జోష్ లో ఉంది. జట్టులో స్టార్ ప్లేయర్స్ లేకపోయినా కలిసి కట్టుగా ఆడుతూ విజయాలను సాధిస్తోంది. ఇందుకు భిన్నంగా భారత్ పరిస్థితి ఉంది. భారత్ సమష్టిగా ఆడటంలో విఫలం అవుతుంది. పాకిస్తాన్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో అది స్పష్టమైంది. ఓపెనర్లు, కోహ్లీ మినహా భారత్ బ్యాటింగ్ కుప్పకూలింది. అదే సమయంలో బౌలింగ్ లో పేలవ ప్రదర్శన చేసింది. కానీ, శ్రీలంక పరిస్థితి అలా లేదు. ఓపెనర్లు కుశాల్ మెండీస్, నిస్సంక, గుణతిలక, దాసున్ శనక, రాజపక్స, కరుణరత్నే, హసరంగా ఇలా ప్రతి ఒక్కరు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బ్యాటింగ్ లో ముగ్గరు లేదా అంతకంటే ఎక్కువ మంది 30 ప్లస్ స్కోర్లు చేస్తూ జట్టుకు విజయాలను అందిస్తున్నారు.
వీక్ గా టెయిలెండర్లు
బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతో జట్టుకు దూరం కావడంతో పాటు షమీని ఆసియా కప్ కోసం ఎంపిక చేయకపోవడం భారత్ నె దెబ్బతీస్తోంది. వీరు లేకపోవడంతో టెయిలెండర్ల బ్యాటింగ్ చాలా వీక్ గా తయారైంది. హర్షల్, షమీ, బుమ్రా వీరు భారీ సిక్సర్లు ఆడగల సమర్థులు. కానీ, భువనేశ్వర్, రవి బిష్ణోయ్, చహల్ ల నుంచి మనం భారీ షాట్లను ఊహించలేం. భువనేశ్వర్ ఆడినా భారీ షాట్లు ఆడలేడు. ఏదీ ఏమైనా టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో భారత్ తప్పక నెగ్గాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asia Cup 2022, Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, India vs srilanka, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Sri Lanka, Virat kohli