హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Sri Lanka : డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ కు భారీ దెబ్బ.. వెటరన్ కు ఛాన్స్ ఇచ్చిన టీమిండియా.. తుది జట్లు ఇవే

India vs Sri Lanka : డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ కు భారీ దెబ్బ.. వెటరన్ కు ఛాన్స్ ఇచ్చిన టీమిండియా.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - India vs Sri Lanka : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా భారత్ (India) డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. దుబాయ్ (Dubai) వేదికగా సూపర్ 4లో భాగంగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న మ్యాచ్ లో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - India vs Sri Lanka : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా భారత్ (India) డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. దుబాయ్ (Dubai) వేదికగా సూపర్ 4లో భాగంగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న మ్యాచ్ లో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డూ ఆర్ డై మ్యాచ్ లో టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక (Dasun Shanaka) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రాణించిన రవి బిష్ణోయ్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకుంది.

మరోసారి పంత్ కు అవకాశం

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విఫలం అయిన పంత్ కు మరో అవకాశం ఇచ్చింది టీమిండియా. గత మ్యాచ్ లో మొదట్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఆరంభంలో పంత్ బాగానే ఆడాడు. అయితే కీలక సమయంలో అనవసరపు షాట్ కు వెళ్లి పెవిలియన్ కు చేరాడు. దాంతో అతడి స్థానంపై విమర్శలు వచ్చాయి. అయితే పంత్ మీద నమ్మకం ఉంచి టీమిండియా మరో అవకాశం ఇచ్చింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మెరుగ్గా వేసిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది బిష్ణోయ్ మాత్రమే అయితే.. ఈ మ్యాచ్ కోసం అతడిని తప్పించి వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్ లు మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నారు. ఇక మరోవైపు శ్రీలంక మాత్రం అఫ్గానిస్తాన్ పై ఆడిన జట్టునే కొనసాగించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఉన్న జట్టులో అసలంక మినహా మిగిలిన వారు ఫామ్ లో ఉన్నారు. గత రెండు మ్యాచ్ ల్లోనూ 170 పై చిలుకు పరుగులను ఛేదించారు. అసలంక కూడా ఫామ్ లోకి వస్తే భారత్ విజయం మరింత కష్టమయ్యే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా కీలక మ్యాచ్ లో భారత్ టాస్ ఓడిపోవడం దెబ్బే అని చెప్పాలి.


హెడ్ టు హెడ్

టి20ల్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 17 సార్లు గెలిచింది. శ్రీలంక 7 సార్లు విజయం సాధించింది. మరొక మ్యాచ్ రద్దయింది. ఆసియా కప్ లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు (వన్డే, టి20లను కలుపుకుని) తలపడ్డాయి. ఇందులో రెండు జట్లు కూడా చెరో 10 మ్యాచ్ ల్లో విజయం సాధించి సమంగా ఉన్నాయి.

తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రిషభ్ పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, చహల్

శ్రీలంక

నిస్సంక, కుశాల్ మెండీస్, అసలంక, గుణతిలక, షనక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, మహీశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుషనక

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India vs srilanka, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు