హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL : రోహిత్ శర్మ ఒక్కడే.. విఫలమైన మిగతా బ్యాటర్స్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?

IND vs SL : రోహిత్ శర్మ ఒక్కడే.. విఫలమైన మిగతా బ్యాటర్స్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - IND vs SL : డూ ఆర్ డై మ్యాచ్ లో భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs SL : డూ ఆర్ డై మ్యాచ్ లో భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. దాంతో దుబాయ్ (Dubai) వేదికగా సూపర్ 4లో భాగంగా శ్రీలంక (Sri Lanka)తో జరుగుతోన్న మ్యాచ్ లో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. రోహిత్ కు తోడుగా సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) ధాటిగా ఆడటంతో భారత్ మెరుగైన స్కోరును అందుకుంది.

వన్ మ్యాన్ షో

కీలక మ్యాచ్ లో మరోసారి రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ (6), రోహిత్ శర్మలు వచ్చారు. అయితే గత మ్యాచ్ లో లాగే శుభారంభం చేయలేకపోయారు. రాహుల్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఫామ్ లో ఉన్న కోహ్లీని మధుశంక (0) క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ 13 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. అయితే రోహిత్ శర్మ జట్టును ఆదుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ  సిక్సర్ల వర్షం కురిపించాడు. అసిత ఫెర్నాండో ను చీల్చి చెండాడు. వీరిద్దరు మూడో వికెట్ కు 97 పరుగులు జోడించారు. ఒక దశలో రోహిత్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే కరుణరత్నే వేసిన స్లో డెలివరీకి అవుటయ్యాడు. ఇక్కడి నుంచి భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది. బౌలింగ్ కు వచ్చిన శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక సూర్యకుమార్ యాదవ్ ను పెవిలియన్ కు చేర్చాడు.

రోహిత్, సూర్యలు ఆడుతున్న సమయంలో భారత్ 200 పరుగుల మార్కును ఈజీగా అందుకునేలా కనిపించింది. అయితే వీరిద్దరు అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా (17), రిషభ్ పంత్ (17), దీపక్ హుడా (3) విఫలం అయ్యారు. పంత్ ఆరంభంలో మూడు ఫోర్లు కొట్టి టచ్ లో కనిపించినా భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరుకున్నాడు. ఇక చివర్లో రవిచంద్రన్ అశ్విన్ అడపాదడపా షాట్లు ఆడటంతో భారత్  173 పరుగులకు చేరుకుంది.

తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రిషభ్ పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, చహల్

శ్రీలంక

నిస్సంక, కుశాల్ మెండీస్, అసలంక, గుణతిలక, షనక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, మహీశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుషనక

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, India vs srilanka, KL Rahul, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Rohith sharma, Virat kohli

ఉత్తమ కథలు