హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL : గెలిస్తే ముందుకు ఓడితే ఇంటికి.. లంకతో భారత్ డూ ఆర్ డై మ్యాచ్.. ఆ ఇద్దరిపై వేటు ఖాయం.. తుది జట్లు ఇవే

IND vs SL : గెలిస్తే ముందుకు ఓడితే ఇంటికి.. లంకతో భారత్ డూ ఆర్ డై మ్యాచ్.. ఆ ఇద్దరిపై వేటు ఖాయం.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

Asia cup 2022 : ఆసియా కప్ (Asia Cup)ను 8వసారి సాధించాలనే పట్టుదలతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టోర్నీలో అడుగుపెట్టిన భారత్ (India)కు గత ఆదివారం ఎదురుదెబ్బ తగిలింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia cup 2022 : ఆసియా కప్ (Asia Cup)ను 8వసారి సాధించాలనే పట్టుదలతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టోర్నీలో అడుగుపెట్టిన భారత్ (India)కు గత ఆదివారం ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ 4లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్ ఐదో బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో విజయం కోసం పోరాడినప్పటికీ పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ భారత్ విజయాన్ని దూరం చేశాయి. ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ తన తదుపరి రెండు మ్యాచ ల్లోనూ విజయాలు సాధించాల్సి ఉంది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా మంగళవారం శ్రీలంక (Sri Lanka)తో భారత్ తాడోపేడో తేల్చుకోనుంది. అఫ్గానిస్తానపై విజయంతో శ్రీలంక సూపర్ 4 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి.

ఆ ఇద్దరిపై వేటు ఖాయం

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా విఫలం అయిన రిషభ్ పంత్, యుజువేంద్ర చహల్ లను పక్కన పెట్టే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కు కూడా అవకాశం లేకపోలేదు. అశ్విన్ ను తీసుకుంటే మాత్రం భారత బ్యాటింగ్ లో ఎడం చేతి బ్యాటర్ ఉండడు. దాంతో చహల్ స్థానంలో అశ్విన్ కంటే కూడా అక్షర్ పటేల్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇక ఓపెనర్లు రాహుల్, రోహిత్ లు ఫామ్ లోకి రావడం.. కోహ్లీ నిలకడ చూపిస్తుండటం భారత్ కు కలిసొచ్చే అంశాలు.

తక్కువగా అంచనా వేస్తే చిత్తవ్వడం ఖాయం

అదే సమయంలో శ్రీలంకను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. టోర్నీని దారుణ ప్రదర్శనతో ఆరంభించినా.. అనంతరం ఆ జట్టు పుంజుకుంది. టీంలో ఆల్ రౌండర్లు ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. 8వ వరుస వరకు కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉండటం ఆ జట్టు బలం. ఓపెనర్లు నిసంక, కుశాల్ మెండీస్ లు ఫామ్ లో ఉన్నారు. మిడిలార్డర్ లో అసలంక మాత్రమే పరుగుల కోసం ఇబ్బంది పడుతున్నాడు. గుణతిలక, కెప్టెన్ షనక, రాజపక్స ఇలా అందరూ తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే వారే. ఆల్ రౌండర్లు హసరంగ, కరుణరత్నే అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే వీరి ప్రధాన సమస్య అనుభం లేకపోవడం. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.

హెడ్ టు హెడ్

టి20ల్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 17 సార్లు గెలిచింది. శ్రీలంక 7 సార్లు విజయం సాధించింది. మరొక మ్యాచ్ రద్దయింది.

తుది జట్ల అంచనా

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్/అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్

శ్రీలంక

నిస్సంక, కుశాల్ మెండీస్, అసలంక, గుణతిలక, షనక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, మహీశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుషనక

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India vs srilanka, KL Rahul, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు