హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : వామ్మో మరీ ఇంత కోపమా రోహిత్.. పక్కన ఉండి ఉంటే అతడిని తప్పకుండా కొట్టేవాడేమో

IND vs PAK : వామ్మో మరీ ఇంత కోపమా రోహిత్.. పక్కన ఉండి ఉంటే అతడిని తప్పకుండా కొట్టేవాడేమో

PC : TWITTER

PC : TWITTER

IND vs PAK : ఆసియా కప్ (Asia cup) 2022 సూపర్ 4లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లో భారత్ (India) 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్థి ముందు 181 పరుగుల భారీ స్కోరును ఉంచినా.. పేలవ బౌలింగ్.. కీలక సమయాల్లో క్యాచ్ జారవిడవడం భారత్ కొంప ముంచాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs PAK : ఆసియా కప్ (Asia cup) 2022 సూపర్ 4లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లో భారత్ (India) 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్థి ముందు 181 పరుగుల భారీ స్కోరును ఉంచినా.. పేలవ బౌలింగ్.. కీలక సమయాల్లో క్యాచ్ జారవిడవడం భారత్ కొంప ముంచాయి. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో 18వ ఓవర్ ను రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) వేయడానికి వచ్చాడు. క్రీజులో ఖష్ దిల్ షా, ఆసిఫ్ అలీ ఉన్నారు. అయితే బిష్ణోయ్ వేసిన నాలుగో బంతిని ఆసిఫ్ అలీ భారీ షాట్ కు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ కు తీసుకుని షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఉన్న అర్ష్ దీప్ వద్దకు వెళ్లింది.

ఇది కూడా చదవండి  : మ్యాచ్ విన్నర్ ట్యాగ్ తో కళ్లు నెత్తికెక్కితే ఇలాగే ఉంటది.. ఇకనైనా సీనియర్ల మాట విను

చాలా సులభమైన క్యాచ్ కావడంతో అలీ అవుటని అంతా భావించారు. అయితే ఈజీ క్యాచ్ ను అర్ష్ దీప్ సింగ్ క్యాచ్ ను మిస్ చేశాడు. దాంతో కూల్ గా నవ్వుతూ ఉండే రోహిత్ శర్మ ఉగ్రరూపం దాల్చాడు. కోపంతో అర్ష్ దీప్ పై ఊగిపోయాడు. ‘అంత ఈజీ క్యాచ్ ను ఎల ా వదిలేశావ్’ అంటూ ఆగ్రహించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ క్యాచ్ ను అసిఫ్ అలీ 0 పరుగుల వద్ద ఉన్నప్పుడు అర్ష్ దీప్ సింగ్ జారవిడిచాడు. అనంతరం అతడు 8 బంతుల్లోనే 16 పరుగులు చేసి పాకిస్తాన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాక్ టు బ్యాక్ అర్ధ సెంచరీలు సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాదబ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసి నెగ్గింది. మొహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి అర్ధ శతకంతో రాణించాడు. మొహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ గతిని మార్చే ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో కీలక సమయాల్లో భారత్ చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ కూడా పాకిస్తాన్ కు కలిసొచ్చింది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను సెప్టెంబర్ 6న శ్రీలంకతో ఆడనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు