హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat kohli : అదిరా కోహ్లీ అంటే.. పాక్ బౌలర్ పట్ల కింగ్ కోహ్లీ ఔదార్యం.. అడగ్గానే ఇచ్చేశాడు..

Virat kohli : అదిరా కోహ్లీ అంటే.. పాక్ బౌలర్ పట్ల కింగ్ కోహ్లీ ఔదార్యం.. అడగ్గానే ఇచ్చేశాడు..

PC : TWITTER

PC : TWITTER

Virat kohli : అతడికి కోపం ఎక్కువ.. ఎప్పుడూ దూకుడుగా ఉంటాడు.. అనవసరంగా గొడవలకు దిగుతాడు.. తల పొగరు ఎక్కువ.. విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఎక్కువగా వినపడే మాటలు ఇవి. కానీ, కోహ్లీ కూడా శాంతి స్వభావుడే అంటే చాలా మంది ఒప్పుకోరు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Virat kohli : అతడికి కోపం ఎక్కువ.. ఎప్పుడూ దూకుడుగా ఉంటాడు.. అనవసరంగా గొడవలకు దిగుతాడు.. తల పొగరు ఎక్కువ.. విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఎక్కువగా వినపడే మాటలు ఇవి. కానీ, కోహ్లీ కూడా శాంతి స్వభావుడే అంటే చాలా మంది ఒప్పుకోరు. అంతేకాకుండా తాను బెటర్ బ్యాటర్ (Batter) అని కోహ్లీకి బలుపు కాస్త ఎక్కువ అని కూడా అంటుంటారు. అయితే కోహ్లీ మాత్రం తాను ముక్కోపిని కాదని చాలా సార్లు చెప్పాడు. తాను ఎవరితోనూ గొడవ (Fight)కు దిగను అని.. అయితే తనను గొడవలోకి లాగితే మాత్రం ఊరుకోనని చెబుతాాడు. అంతేకాకుండా మ్యాచ్ జరుగుతున్నప్పుడు తన తోటి ప్లేయర్ ను ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోనని కూడా చెబుతాడు. భారత ప్లేయర్ నే కాదు ప్రత్యర్థి ప్లేయర్లకు కూడా కోహ్లీ అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


2019 వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగుతుంది. బాల్ ట్యాంపరింగ్ నిషేధం తర్వాత స్టీవ్ స్మిత్ మళ్లీ ఆసీస్ జట్టులోకి వస్తాడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో స్మిత్ ఫీల్డింగ్ చేస్తుండగా.. భారత అభిమానులు చీటర్ చీటర్ అంటూ హేళన చేస్తారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ స్మిత్ ను సపోర్ట్ చేయాలంటూ పేర్కొంటాడు. స్మిత్ తప్పు చేసినా దానిని ఒప్పుకుని శిక్ష కూడా అనుభవించాడని ఇకపై అతడిని హేళన చేయడం తగదని సొంత అభిమానులకు తెలియజేస్తాడు. తాజాగా మరోసారి కోహ్లీ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.  పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటోగ్రాఫ్ కావాలంటూ కోహ్లీని పాకిస్తాన్ బౌలర్ హరీస్ రావూఫ్ అడుగుతాడు. వెంటనే తన జెర్సీపై సంతకం చేసి అతడికి ఇస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ మ్యాచ్ కు ముందు కూడా గాయంతో ఆసియా కప్ కు దూరమైన షాహీన్ అఫ్రిదిని పలకరిస్తాడు కోహ్లీ. గాయం గురించి తెలుసుకుంటాడు. అంతేకాకుండా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు అతడికి చెబుతాయి. కోహ్లీనే కాదు చహల్, పంత్, రోహిత్ ఇలా ఇతర భారత ప్లేయర్లు కూడా ఇతర దేశాల క్రికెటర్లతో పరస్పరం గౌరవంగా ఉంటూ రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు