హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : మరోసారి చిరకాల ప్రత్యర్థి పాక్ తో భారత్ పోరు.. తుది జట్టులో భారీ మార్పులు చేయనున్న ద్రవిడ్.. తుది జట్టు ఇదే

IND vs PAK : మరోసారి చిరకాల ప్రత్యర్థి పాక్ తో భారత్ పోరు.. తుది జట్టులో భారీ మార్పులు చేయనున్న ద్రవిడ్.. తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - IND vs PAK: మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు సిద్ధమయ్యాయి. సరిగ్గా వారం రోజుల తర్వాత ఈ రెండు జట్లు మరోసారి ఆసియా కప్ (Asia Cup) 2022 వేదికగా తలపడనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs PAK: మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు సిద్ధమయ్యాయి. సరిగ్గా వారం రోజుల తర్వాత ఈ రెండు జట్లు మరోసారి ఆసియా కప్ (Asia Cup) 2022 వేదికగా తలపడనున్నాయి. ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ జరగ్గా.. అందులో భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్ ఎ నుంచి కూడా ఈ రెండు జట్లు సూపర్ 4 దశకు చేరడంతో మరోసారి పోరు అనివార్యమైంది. సెప్టెంబర్ 4న జరిగే సూపర్ 4 రెండో మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగానే భారత్ ఈ మ్యాచ్ ను ఆడనుంది.

భారత్ ను వెంటాడుతున్న సమస్యలు

ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా వీరోచిత పోరాటంతో ఆ మ్యాచ్ లో భారత్ త్రుటిలో ఓటమిని తప్పించుకుని విజయాన్ని అందుకుంది. అయితే ఆ మ్యాచ్ కు ఈ మ్యాచ్ కు చాలా తేడా ఉంటుంది. భారత్ ను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. పాక్ తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో అతడి మోకాలి గాయం తిరగబెట్టడంతో అతడు ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు. అదే సమయంలో భారత్ ను ఓపెనర్ల ఫామ్ ఇబ్బంది పెడుతోంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు భారీ స్కోర్లను సాధించడంలో విఫలం అవుతున్నారు. వీటితో పాటు పేస్ బౌలింగ్ కూడా భారత్ ను కలవరపెడుతుంది. ఈ టోర్నీ కోసం భారత్ కేవలం ముగ్గురు పేసర్లనే ప్రకటించింది. దీపక్ చహర్ ఉన్నా అతడు స్టాండ్ బై ప్లేయర్ గానే ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ మాత్రమే పేస్ విభాగంలో రాణిస్తుండగా.. అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్ లు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. వీటిని సరి చేసుకుంటనే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ పైచేయి సాధించే అవకాశం ఉంటుంది.

భారత కూర్పు ఎలా ఉంటుంది

పాక్ తో జరిగే మ్యాచ్ కోసం భారత్ భారీ మార్పులనే చేసే అవకాశం ఉంది. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ కు దూరమైన హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రానున్నాడు. అయితే అతడు ఎవరి స్థానంలో వచ్చే అవకాశం ఉందో ఆసక్తికరంగా ఉండనుంది. గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో కూడా ఎవరు వస్తారనేది ఉత్కంఠను కలిగిస్తోంది. అదే సమయంలో వరుసగా విఫలం అవుతున్న రాహుల్ కు మరో అవకాశం ఉంటుందా అనేది కూడా తేలాల్సి ఉంది. ద్రవిడ్ ఆలోచనను బట్టి చూస్తే.. అవేశ్ ఖాన్ పై వేటు పడే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ కు మరో అవకాశం దక్కవచ్చు. ఇక జడేజా స్థానం కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. అక్షర్ పటేల్, దీపక్ హుడాలలో ఒకరు జడేజా స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ జడేజాలాగే లెఫ్టార్మ్ స్పిన్నర్, ఎడంచేతి వాటం బ్యాటర్. స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఎడంచేతి బ్యాటర్లు జట్టులో ఉండాలి. పంత్ రూపంలో ఒకరు ఉన్నా.. మరొక బ్యాటర్ ఉంటే మంచిది. ఇలా ఆలోచిస్తే మాత్రం జడేజా స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. లేదంటే దీపక్ హుడాకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా చాలా బలంగా ఉంది. రిజ్వాన్ సూపర్ ఫామ్ లో ఉండటం.. ఫఖర్ జమాన్ కూడా ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు కలసి వచ్చే అంశం. ఇక నసీం షా, రావూఫ్, షాదబ్ ఖాన్, నవాజ్ రూపంలో జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. అయితే బాబర్ ఆజమ్ ఫామ్ కొంచెం ఆందోళనను కలిగిస్తోంది. మరోసారి రెండు జట్ల మధ్య టఫ్ ఫైట్ జరగడం మాత్రం ఖాయం.

భారత తుది జట్టు (అంచనా)

కేఎల్ రాహుల్/దీపక్ హుడా, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు