హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : భారత బౌలర్ల దెబ్బకు వణికిపోయిన పాక్ బ్యాటర్లు.. మరీ ఇంత చీప్ స్కోరా? భారత్ టార్గెట్ ఎంతంటే?

IND vs PAK : భారత బౌలర్ల దెబ్బకు వణికిపోయిన పాక్ బ్యాటర్లు.. మరీ ఇంత చీప్ స్కోరా? భారత్ టార్గెట్ ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - IND vs PAK :  ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా ఆదివారం హైవోల్టేజి మ్యాచ్ లో భారత (India) బౌలర్లు సత్తా చాటారు. దుబాయ్ వేదికగా గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ (Pakistan)తో జరుగుతోన్న మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), హార్దిక్ పాండ్యా (Hardik Pandya)లు అదరగొట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs PAK :  ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా ఆదివారం హైవోల్టేజి మ్యాచ్ లో భారత (India) బౌలర్లు సత్తా చాటారు. దుబాయ్ వేదికగా గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ (Pakistan)తో జరుగుతోన్న మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), హార్దిక్ పాండ్యా (Hardik Pandya)లు అదరగొట్టారు. వీరి దెబ్బకు పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ కకావికలం అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున మొహమ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇఫ్తిఖర్ అహ్మద్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్ లకు ఒక్కో వికెట్ లభించింది.


బాబర్ విఫలం


టాస్ గెలిచిన రోహిత్ శర్మ అందరూ ఊహించిన విధంగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ లు బ్యాటింగ్ వచ్చారు. ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అర్ధ శతకాలు సాధిస్తున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్ లో విఫలం అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం 2 బౌండరీలు బాదిన అతడు భువనేశ్వర్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి  అర్ష్ దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆరో ఓవర్ ఐదో బంతికి ఫఖర్ జమాన్ (6 బంతుల్లో 10; 2 ఫోర్లు)ను అవేశ్ ఖాన్ పెవలియన్ కు చేర్చాడు. అయితే ఇఫ్తిఖర్ అహ్మద్, రిజ్వాన్ లు జట్టును ఆదుకున్నారు. వీరు నెమ్మదిగా ఆడుతూ ఒక్కో పరుగును జోడించారు. ఈ క్రమంలో వీరు మూడో వికెట్ కు 45 పరుగులు జోడించాడు. అయితే హార్దిక్ పాండ్యా  వీరిద్దరిని అవుట్ చేశాడు. దాంతో పాక్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. అయితే చివర్లో హరీస్ రవూఫ్ (7 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు), దహాని (6 బంతుల్లో 16 ; 2 సిక్సర్లు) ఆఖర్లో దూకుడుగా ఆడటంతో పాక్ 150 స్కోరుకు సమీపంగా వచ్చింది.



తుది జట్లు భారత్ రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, జడేజా, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్


పాకిస్తాన్ బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, రిజ్వాన్, అసిఫ్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, కుష్ దిల్ షా, షాదబ్ కాన్, హరీష్ రావూఫ్, నసీం షా, మొహమ్మద్ నవాజ్, దహని

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Ravindra Jadeja, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు